Latest Telugu News : ECI : ఓట్ల రిగ్గింగ్‌పై రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చిన ఈసీ!

Read Time:  1 min
ECI
ECI
FONT SIZE
GET APP

హర్యానాలో ఓట్ల రిగ్గింగ్‌ జరిగిందని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ECI )వర్గాలు తోసిపుచ్చాయి. ఓటర్ల జాబితాపై ఎలాంటి అప్పీల్స్‌ దాఖలు కాలేదంటూ ఈసీ అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ కథనం తెలిపింది. ఫేక్‌ ఓటర్లను నివారించాలంటే కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లు సవరణ సమయంలో ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తలేదని ఈసీ (ECI) వర్గాలు ప్రశ్నించాయి. ఓటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, అవకతవకలను గుర్తించడానికి రాజకీయ పార్టీలు బూత్‌ స్థాయి ఏజెంట్లను కూడా నియమిస్తాయని గుర్తు చేశారు.

Read Also : http://బెంగళూరులో రెండో విమానాశ్రయంకు వేగంగా అడుగులు

ECI
ECI

గత హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్‌ జరిగిందని రాహుల్‌ గాంధీ బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఎన్నికల కమిషన్, బిజెపి కుట్రపూరితంగా వ్యవహరించాయని.. హర్యానాలో 2.5 మిలియన్ల ఓట్లు చోరీకి గురయ్యాయని వ్యాఖ్యానించారు. అందులో 5.21లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్ పేర్కొన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్ రెండింటిలోనూ బీజేపీతో సంబంధం ఉన్న వేలాది మంది ఓటు వేశారని ఆరోపించారు.

భారత ఎన్నికల కమిషను విధి ?

దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.

భారత ఎన్నికల కమిషను వ్యవస్థ పనితీరు?

రాజ్యాంగ సంస్థ అయిన కమిషను ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర సంస్థ. దీని ముఖ్య కార్యకలాపాలు ఇలా ఉన్నాయి. రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వడం, రద్దు చేయడం. ఎన్నికల ప్రణాళికను నిర్ణయించడం, ప్రకటించడం, అమలు చేయడం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం, అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టడం. స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.