బీహార్ (Bihar) లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 22తో ముగియనుండటంతో, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) (EC) సమగ్ర ఏర్పాట్లను చేపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు రాష్ట్రంలోని ముఖ్య అంశాలను సమీక్షించేందుకు ఇప్పటికే అధికారులు వ్యూహరచన మొదలుపెట్టారు.
రాష్ట్రంలో కీలకమైన ఛఠ్ పూజ పండుగ తర్వాత ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్న ఈసీ, నవంబర్ 5 నుంచి 15వ తేదీ మధ్య మూడు దశల్లో పోలింగ్ (Polling in three phases) నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు వచ్చే వారం కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీహార్‌లో పర్యటించనున్నారు.
ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది
ఆయన పర్యటన ముగిసిన తర్వాత, అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22వ తేదీతో ముగియనుంది. ఈలోగా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.మరోవైపు, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది.

జాబితా నుంచి ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను తొలగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ చర్యను సవాలు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, సెప్టెంబర్ 30న ప్రకటించే తుది ఓటర్ల జాబితా చట్టవిరుద్ధంగా ఉందని తేలితే మొత్తం జాబితాను రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఎన్డీయే కూటమి విజయం సాధించి
కాగా, 2020లో కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లోనే జరిగాయి. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఆ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకోగా, ఆర్జేడీ నేతృత్వంలోని కూటమి ప్రతిపక్షానికే పరిమితమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: