దేశవ్యాప్తంగా వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ వంటగ్యాస్ వినియోగదారు ప్రతి సంవత్సరం మార్చి 31లోపు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ (e-KYC) పూర్తిచేయాలని స్పష్టం చేసింది. లేకపోతే ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PM Ujjwala Yojana) కింద లభించే సబ్సిడీ నిలిపివేయబడుతుందని తెలిపింది.
Read Also: Gold rate 30/10/25 : మరోసారి పెరుగుతున్న బంగారం, వెండి ధరలు – నగరాల వారీగా వివరాలు
దీంతో పెట్రోలియం కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు టార్గెట్లు పెట్టి ఈ-కేవైసీ (e-KYC) చేయిస్తున్నాయి. వినియోగదారులు మొబైల్ యాప్ ద్వారా కూడా బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ చేసుకోవచ్చు. వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీ (Gas Agency) వద్దకు వెళ్లి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్, రిజిస్టర్ మొబైల్ నంబర్ చూపించి బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవచ్చు.

అదేవిధంగా ఆయిల్ కంపెనీల అధికారిక మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తిచేయవచ్చు. వినియోగదారు ఆధార్ నంబర్ నమోదు చేసి, OTP లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా ధృవీకరించవచ్చు. ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే వినియోగదారుని ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: