📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ లగ్జరీ కారు సీజ్

Author Icon By Anusha
Updated: September 23, 2025 • 10:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో విలాసవంతమైన కార్లపై పన్ను ఎగవేత జరుగుతోందన్న సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ విభాగం సంయుక్తంగా పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ అనే కోడ్ పేరు పెట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనుమానాస్పద వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తున్నాయి. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అనేక లగ్జరీ కార్లను తక్కువ పన్ను చెల్లించి దేశంలోకి తెచ్చి, నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో నడుపుతున్నట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో భాగంగా మంగళవారం నాడు ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) కు చెందిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న ఈ కారును కొచ్చిలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. 2012 మోడల్ అయిన ఈ వాహనం ఇప్పటికే మూడుసార్లు చేతులు మారగా, ప్రస్తుతం దుల్కర్ మూడో యజమానిగా ఉన్నట్లు సమాచారం.

ఏకకాలంలో సోదాలు చేపట్టా

ఈ స్కామ్ విచారణలో కేరళ కీలకంగా మారడంతో అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. తిరువనంతపురం, ఎర్నాకుళం, కొట్టాయం, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో దాదాపు 30 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా కొచ్చి సమీపంలోని మమ్ముట్టి పాత నివాసంలో పార్క్ చేసి ఉన్న ఎనిమిది లగ్జరీ కార్ల (Luxury cars) ను అధికారులు గంటల తరబడి తనిఖీ చేశారు.

Dulquer Salmaan

మరో నటుడు అమిత్ చాకలక్కల్‌కు సంబంధించిన రెండు వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.భూటాన్ మార్గంలో దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు పన్నులు ఎగవేస్తున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ వాహనాలను మొదట హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో రిజిస్టర్ చేసి, ఆ తర్వాత నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

అధికారులు తనిఖీలు

దాదాపు ఎనిమిది రకాల ఖరీదైన కార్లను ఈ పద్ధతిలో దేశంలోకి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.ఈ దాడుల నేపథ్యంలో నటులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), దుల్కర్ సల్మాన్ నివాసాల్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. కేవలం ప్రముఖులపైనే కాకుండా, వాణిజ్యపరంగా కార్లను దిగుమతి చేసే వారిపైనా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని,

అధికారులు స్పష్టం చేశారు. వాహనాలు సీజ్ చేసిన వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసి, యాజమాన్య హక్కులు, దిగుమతి పత్రాలను సమర్పించాలని కోరతామని తెలిపారు. ఈ స్కామ్ చాలా పెద్దదని, పలు దశల్లో విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News customs crackdown directorate of revenue intelligence dulquer salmaan land rover defender seized latest news luxury car tax evasion scam operation namkhor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.