నేడు (జూన్ 20) భారతదేశ తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) గారి జన్మదినం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆమెకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ‘ఎక్స్’ వేదికగా (ట్విట్టర్) రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత అందరికీ బలాన్నిస్తుందని తెలిపారు. పేద, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆమె ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఇతర ప్రముఖుల శుభాకాంక్షలు
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది, గవర్నర్లు, ముఖ్యమంత్రులు మరియు శాసనసభా సభ్యులు తదితర ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Read also: CM Revanth : నేడు ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ