Drone survey: భారతదేశంలో డ్రోన్ (Drone) రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయిన డ్రోన్ల సంఖ్య 38,500 మార్కును దాటింది. అదే సమయంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి ధృవీకరణ పొందిన రిమోట్ పైలట్ల సంఖ్య 39,890కి చేరినట్లు మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి.
వ్యవసాయం, భూమి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తుల అంచనా, ప్రభుత్వ సేవల వంటి కీలక రంగాల్లో ఇప్పుడు డ్రోన్లు అంతర్భాగంగా మారాయి. ముఖ్యంగా, ‘స్వామిత్వ’ పథకం కింద దేశంలోని 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేశారు. దీని ద్వారా 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను సిద్ధం చేశారు. 244 రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు (RPTOs) కార్యకలాపాలు ఏర్పాటయ్యాయి.
Read Also: Karnataka: స్కూల్ పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
మహిళా సాధికారతకు కూడా డ్రోన్ టెక్నాలజీ ఊతమిస్తోంది. ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం కింద 500కు పైగా డ్రోన్లతో సహా, మొత్తం 1,094 డ్రోన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) పంపిణీ చేశారు. భవిష్యత్తులో దేశీయ తయారీ, పైలట్లకు నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ మద్దతుతో మానవ రహిత వైమానిక వ్యవస్థల రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉందని అధికారిక ప్రకటన వివరించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: