📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Drone Strikes : పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

Author Icon By Divya Vani M
Updated: May 9, 2025 • 7:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ పాక్‌పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ లాగా గట్టి ఎదురు దాడికి దిగింది. ఈసారి లక్ష్యం పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు.లాహోర్, రావల్పిండి, కరాచీ సహా తొమ్మిదివేలు నగరాల్లో భారత్ తన దాడులు ప్రారంభించింది. “సియాడ్” అనే వ్యూహాత్మక మిషన్‌ ద్వారా ఈ దాడులు జరిగాయి. ఇది “సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్” అనే ఆపరేషన్.ఈ దాడుల్లో భారత్ 25కు పైగా డ్రోన్లు ప్రయోగించింది. ఇవి గగనతల రక్షణ వ్యవస్థలపై నిశితంగా దాడి చేశాయి. ముఖ్యంగా లాహోర్‌లోని టార్గెట్‌ను అద్భుతంగా ఛేదించాయి.పాక్ వద్ద చైనా నుంచి దిగుమతి చేసిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి యుద్ధ విమానాలు, క్షిపణులను గుర్తించి కూల్చే శక్తి కలవైనవి.అందుకే భారత్ ముందుగానే వాటిపై దాడి చేసి అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో రాడార్లు కీలకం.

Drone Strikes పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

అవి రాడార్ సిగ్నల్స్‌ ద్వారా విమానాలను గుర్తిస్తాయి.అయితే, అదే రాడార్ సిగ్నల్స్ ద్వారా ఆ వ్యవస్థల స్థానాలను కూడా గుర్తించవచ్చు.భారత్ రుద్రమ్, కేహెచ్-31పీ మిసైళ్లను ఇందులో వినియోగించింది.కేహెచ్-31పీ రష్యన్‌ తయారీ కాగా, రుద్రమ్ క్షిపణి భారత్ స్వదేశీ ప్రతిభ. ఇవి శత్రువు రాడార్ సిగ్నల్స్‌ను గుర్తించి దాడి చేస్తాయి.ఇక ఇజ్రాయెల్ నుంచి తీసుకున్న హరోప్ కామికాజ్ డ్రోన్లూ ఉపయోగించబడ్డాయి. ఇవి టార్గెట్‌ పై ఎగిరుతూ చివరికి తామే పేలి ధ్వంసం చేస్తాయి.ఈ డ్రోన్లు ఎయిర్ డిఫెన్స్ టవర్లను తాకేందుకు గాలిలో చాకచక్యంగా మార్గాన్ని ఎంచుకుంటాయి. ఇవి ఆకస్మికంగా దాడి చేసి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి.భారత్ ఈసారి 25కు పైగా డ్రోన్లతో ముందడుగు వేసింది.

పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై వీటి దాడి స్పష్టంగా వీడియోల్లో కనిపించింది.పాక్ తన మీడియా వేదికగా “ఇవన్నీ కూల్చేశాం” అన్నా, వీడియోలు వాస్తవాన్ని బయటపెట్టేశాయి.భారత రక్షణ శాఖ ఈ దాడిపై స్పందించింది.లాహోర్‌లోని లక్ష్యాన్ని సరిగ్గా ఛేదించామంటూ స్పష్టం చేసింది. ఈ దాడులు పాక్‌కు బలమైన సందేశం ఇచ్చినట్టు భద్రతా వర్గాలు అంటున్నాయి.భారత వ్యూహాత్మక మేధస్సు, సాంకేతిక శక్తి మరోసారి చాటిచెప్పింది. శత్రు ముప్పులను ముందుగానే గుర్తించి ధీటుగా సమాధానం చెప్పగల శక్తి భారత్‌కి ఉంది.ఇలాంటి సియాడ్ దాడులు పాక్ గగనతలపై తక్కువకాలపు ఆధిపత్యాన్ని తీసుకువస్తాయి. అలాగే భవిష్యత్ లో జరగబోయే ఏదైనా పెద్ద దాడికి ముందస్తు సన్నాహకంగా ఉంటాయి.ఈ దాడులూ, వాటి ప్రభావమూ, సాంకేతిక విజ్ఞానమూ భారత రక్షణ శక్తిని ప్రపంచానికి తెలియజేశాయి.

Read Also : Pakistani Pilot : పాకిస్థాన్‌ పైల‌ట్‌ను అదుపులోకి తీసుకున్న భార‌త‌ ఆర్మీ

Harop kamikaze drone India India Pakistan SEAD strike India targets Pakistan air defense Indian Air Force drone attack KH-31P missile strike Lahore drone strike India Rudram missile India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.