📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

DRM Chandrasekhar Gupta: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి: డిఆర్ఎం సిఎస్ గుప్తా

Author Icon By Digital
Updated: August 30, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంతకల్లు రైల్వే: శుక్రవారం జాతీయ క్రీడా(Sports) దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే క్రీడామైదానంలో జరిగిన కార్యక్రమంలో డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా(DRM Chandrashekhar Gupta) మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో అదనపు డిఆర్ఎం సుధాకర్, డివిజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, సీనియర్ డిఎంఇ మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ 1925 ఆగస్టు 29న అలహాబాద్లో జన్మించారని, పంజాబ్ రిజిమెంట్లో మేజర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారని గుర్తు చేశారు. ఆయన క్రీడాస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడల ప్రోత్సాహం కోసం రైల్వే అనేక పథకాలను ప్రవేశపెడుతోందని చెప్పారు. క్రీడలు వ్యక్తిలో స్వాతంత్ర్య భావాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, స్నేహ సహకారాలను అభివృద్ధి చేస్తాయని వివరించారు. శారీరక ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలను క్రీడల ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్ పోటీలను నిర్వహించగా, సీనియర్ క్రీడాకారులు కూడా పాల్గొన్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జాతీయ క్రీడా దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 29న జరుపుకుంటారు.

క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, స్నేహ సహకారాలు పెంపొందిస్తాయి. అలాగే శారీరక ఆరోగ్యం, శక్తి సామర్థ్యాలు అందిస్తాయి.

జాతీయ క్రీడా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా ఆయన క్రీడాస్ఫూర్తిని స్మరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

Read hindi news: Hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-metro-train-metro-rail-services-for-ganesh-festival/telangana/538151/

Cricket Matches DRM Chandrasekhar Gupta Guntakal Railway Major Dhyan Chand National Sports Day Railway Sports Association South Central Railway sports news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.