Driving Licence : ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం స్వస్థలం వదిలి మరో నగరానికి వెళ్లడం ఇప్పుడు సాధారణమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే చిరునామా మారిన తర్వాత కూడా పాత అడ్రస్‌తోనే డ్రైవింగ్ లైసెన్స్ వాడటం చట్టవిరుద్ధం. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌పై ప్రస్తుత నివాస చిరునామా ఉండటం తప్పనిసరి.
ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర రవాణా శాఖ ‘పరివహన్ సేవా’ పోర్టల్ ద్వారా చిరునామా మార్పును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దరఖాస్తుదారులు parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘డ్రైవింగ్ లైసెన్స్ సేవలు’ ఎంపిక చేసుకోవాలి. అక్కడ ‘చేంజ్ ఆఫ్ అడ్రస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, డీఎల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించాలి.
Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్‌లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి (Driving Licence) మారినప్పుడు (ఉదాహరణకు ఏపీ నుంచి తెలంగాణకు) పాత ఆర్టీవో నుంచి నిరభ్యంతర పత్రం (NOC) తప్పనిసరి. ఫారం–33, ఆధార్ లేదా ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రాలు, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు సమర్పించాలి. ఈ ఆన్‌లైన్ విధానం వల్ల ఆర్టీవో చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి నుంచే అడ్రస్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: