📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Dog Saves: 67 మందిని కాపాడిన కుక్క .. అసలు ఏంజరిగింది ?

Author Icon By Sudheer
Updated: July 8, 2025 • 4:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు (himachal pradesh floods) ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ముఖ్యంగా మండి జిల్లా తీవ్ర ప్రభావానికి గురవుతోంది. జూన్ 30వ తేదీ అర్ధరాత్రి సమయంలో మండి జిల్లాలోని సియతి గ్రామంలో భారీ కొండచరియ విరిగిపడింది. వర్షాల కారణంగా కొండచరియలు కదలడం, వరదల ధాటికి చాలా ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. అర్ధరాత్రి సమయమైతే ప్రజలు గాఢ నిద్రలో ఉండే సమయంలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయి. కానీ ఈసారి మాత్రం ఒక కుక్క అప్రమత్తతతో 67 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.

కుక్క అరుపుతో నిద్రలేచిన గ్రామస్తులు

సియతి గ్రామంలోని ఓ ఇంటి రెండో అంతస్తులో ఉన్న కుక్క (Dog), ముప్పు సంభవించబోతున్నట్టు గ్రహించి గట్టిగా అరవడం ప్రారంభించింది. ఆ అరుపులు విన్న యజమాని నిద్రలేచి బయట పరిస్థితిని గమనించగా ఇంటి గోడకు పగుళ్లు ఏర్పడటం, నీళ్లు లోపలికి వచ్చిపోవడం గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యుల్ని నిద్రలేపి బయటకు తీసుకెళ్లాడు. అంతే కాదు, సమీప ఇళ్లవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాడు.

కుక్క చొరవతో 67 మందికి ప్రాణరక్షణ

ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమంటే, కుక్క అరుపుల వల్ల అప్రమత్తమైన ఆ గ్రామస్తులంతా సురక్షితంగా తప్పించుకున్న తర్వా… మళ్లీ మరో భారీ కొండచరియ విరిగిపడి గ్రామాన్ని కబళించింది. మొత్తం గ్రామం నేలమట్టమవగా, అక్కడున్న 67 మంది కేవలం ఆ కుక్క హెచ్చరికతో ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రస్తుతం వారు పక్క గ్రామంలోని ఆలయంలో తాత్కాలికంగా నివసిస్తున్నారు. ఈ ఘటనలో ఆ కుక్క ప్రదర్శించిన అపూర్వ మానవత్వం అందరినీ ఆకట్టుకుంది.

Read Also : Fish Venkat: ఫిష్ వెంకట్‌కు ఆర్థికసాయం చేసిన హీరో విశ్వక్సేన్!

Dog's Bark Saves 67 Lives Google News in Telugu Himachal pradesh Mandi district raised alarm timely bark

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.