📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Doctor negligence: ఎమర్జెన్సీ వార్డులో వైద్యుడి మొద్దునిద్ర.. పేషెంట్ మృతి.. వీడియో వైరల్

Author Icon By Ramya
Updated: July 29, 2025 • 1:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Doctor negligence: వైద్యుడే దేవుడని రోగులు భావిస్తారు. ప్రాణాపాయస్థితిలో వైద్యం చేసి, ప్రాణాలను కాపాడితే అతడిని తమ దేవుడిగా అనుకుంటారు. కృతజ్ఞతలు చెప్పుకుంటారు. కానీ అదే వైద్యుడు ప్రాణం పోతున్నా ఏమాత్రం స్పందించకుండా మొద్దు నిద్రలో ఉంటే అలాంటి వైద్యులను ఏమనాలి? మీరెంత లేపినా నేను నిద్ర లేవనంటే లేవను అని మొండిగా నిద్రపోతున్న వైద్యుడి చర్యవల్ల అత్యవసర వైద్యం అందక ఓ రోగి మరణించిన విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది. ప్రమాదంలో గాయపడి, మరణించిన రోగి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకొచ్చి అత్యవసర వైద్యం కోసం తపించారు. ఓవైపు రక్త మోడుతూ బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నా.. భుజాన చంటిబిడ్డతో బాధితుడి భార్య ప్రాధేయపడుతున్నా వైద్యుడు మాత్రం నిద్ర నుంచి లేవలేదు. ఎమర్జెన్సీ వార్డులో సేవలందించాల్సిన వైద్యుడు ఏసీ వేసుకుని మరీ నిద్రిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బంధువుల ఆందోళన

Doctor negligence: వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా నిండుప్రాణం పోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైద్యుడిని సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించారు అధికారులు. సోమవారం అర్థరాత్రి మేరల్లో జరిగిన రోడ్డు
ప్రమాదంలో సునీల్ కుమార్ (Sunil Kumar) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సునీల్కు మార్కు బంధువులు స్థానికంగా ఉన్న లాలా లజపతిరాయ్ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాఢనిద్రపోయిన జూనియర్ డాక్టర్ (Junior Doctor) స్ట్రెచర్ పై ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లగా అక్కడ విధటుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్కుమార్ రాయ్ ఏసీ వేసుకుని కుర్చీలోనే నిద్రిస్తుండడం కనిపించింది. దీంతో సునీల్ కుమార్ భార్య వైద్యుడి దగ్గరికి వెళ్లి నిద్రలేపేందుకు ప్రయత్నించింది. భుజాన చంటిబిడ్డతో సునీల్ భార్య వైద్యుడిని ఎంతగా ప్రాధేయపడ్డా డాక్టర్ భూపేశ్ నిద్రలేవలేదు. గంటల తరబడి వైద్యం అందకపోవడంతో రక్తస్రావం కారణంగా సునీల్ కుమార్ కన్నుమూశాడు. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ భూపేశ్ నిద్రించడం, సునీల్ కుమార్ భార్య ప్రాధేయపడడం బాధిత కుటుంబసభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడం, కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో ఎల్ఎల్ఆర్ఎం మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు స్పందించి, ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

సన్నీని ఎవరు సజీవదహనం చేశారు?

సన్నీని అతని భార్య అంకిత, ఆమె ప్రియుడు అయ్యూబ్ అహ్మద్, బేబీ, మరియు సుశీల్ కలిసి సజీవదహనం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారు?

పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ ఎవరినీ అరెస్టు చేయలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Murder: యూపీలో భార్య చేతుల్లో భర్త సజీవదహనం

Breaking News doctor-negligence emergency-ward-death latest news patient-death Telugu News up-hospital-incident viral-video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.