📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Doctor: డాక్టర్ కావాలనే ఆశ తీరకుండానే పరువు హత్యకు గురైన యువతి

Author Icon By Sai Kiran
Updated: August 14, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డాక్టర్ కావాలంటే ‘నీట్'(NEET) ఎంట్రన్స్ రాయాలి. ఆ ఎంట్రన్స్ కోసం ఎంతగా కష్టపడి చదవాలినో మనందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఈ నీట్ జాతీయస్థాయిలో రావాలంటే దానికి రాత్రిపగలు కష్టపడి చదివితే తప్ప మంచి ర్యాంక్ రాదు. అలాంటిది ఆ యువతి డాక్టర్ కావాలనే ఆశయంతో కష్టపడి చదివింది. నీట్లో మంచి (Doctor) మార్కులతో పాస్ అయ్యింది. కానీ ఇంతలో పరువుహత్యకు గురికావాల్సి వచ్చింది. టెక్నాలజీ యుగంలో సైతం ఇలాంటి పరువుహత్యలు జరగడం అనాగరికచర్య అని భావించక తప్పదు.

పరువు పేరుతో తండ్రి, బాబాయిలు హత్య

ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ లోని బనస్ కాంతాజిల్లాలో 18 ఏళ్ల చంద్రిక చౌదరి పరువు హత్యకు గురైనట్లుగా ఆరోపణలు ఉన్నాయి. నీట్ కోచింగ్ కోసం పాలన్ పుర్లోని ఒక హాస్టల్లో ఉన్న సమయంలో చంద్రిక. (Gujart) వివాహితుడైన హరేశ్ చౌదరి అనే యువకుడితో ప్రేమలో పడి సహజీవనం ప్రారంభించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి కట్టడి చేశారు.

కోర్టులో పిటిషన్ వేసిన ప్రియుడు

ఒక పాత కేసులో చంద్రిక ప్రియుడు హరేశ్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జూన్ 21వ తేదీన జైలు నుంచి విడుదలైన హరేశ్ చంద్రిక ఆచూకీ కోసం గుజరాత్ హైకోరుట్లఓ హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ జూన్ 27న విచారణకు రావాల్సి ఉంది. అయితే, అంతకు మూడురోజుల ముందే, జూన్ 24న చంద్రిక మృతిచెందింది. మరుసటి రోజు ఉదయాన్నే కుటుంబ సభ్యులు హడావుడిగా ఆమె అంత్యక్రియలు కూడా పూర్తి చేశాడు.

గొంతు నులిమి చంపారు

కాగా చంద్రికను ఆమె కుటుంబ సభ్యులు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రలోకి జారుకున్నాక గొంతు నులిమి చంపారు’ అని ఏఎస్పీ వివరించారు. హరేశ్ ఫిర్యాదు మేరకు పోలసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా డాక్టర్ (Doctor) కావాలనే ఆశయంతో కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకున్న చంద్రిక మాత్రం పరువుహత్యకు గురికావడం పలువురిని కలచివేసింది.

Google News in Telugu gujartlatestnews gujartnews newstoday Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.