కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీ లో ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని (RSS anthem) ఆలపించడం ఆసక్తికరంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ (DK Shivakumar)ను సీఎంగా చూడాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. డీకే (DK Shivakumar) చర్యతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యంతో హర్షధ్వానాలు చేశారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్.. శివకుమార్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా డీకే (DK Shivakumar)ఆర్‌ఎస్‌ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే’ ఆలపించారు. డీకే ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించడంతో అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గట్టిగా బల్లలు చరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీఎం కుర్చీ ఇవ్వకుంటే తాను బీజేపీలో చేరుతానని కర్ణాటక కాంగ్రెస్‌కు డీకే హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ పాటను ఆలపించడంతో అసెంబ్లీలో గందరగోళం, వాగ్వాదం నెలకొంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత శక్తివంతమైన వ్యక్తి ఎవరు?
భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ ఒక రాష్ట్రానికి న్యాయపరమైన అధిపతి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది. కర్ణాటక శాసనసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నర్ సాధారణంగా మెజారిటీ సీట్లు కలిగిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తారు.
డి.కె. శివకుమార్ కులం ఏమిటి?
ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు తమ్ముడు డి.కె. సురేష్ కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు, ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: