📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

DK Shivakumar : సిద్ధరామయ్య నాయకుడిగా ఉండడం పార్టీలో ‘ఎలాంటి అసంతృప్తి’ లేదు

Author Icon By Sudha
Updated: July 2, 2025 • 5:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇటీవల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే, వార్తలకు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)చెక్‌ పెట్టారు. డీకే శివకుమార్‌తో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఐదేళ్లు తానే కర్నాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎవరికి సందేహాలున్నాయని ప్రశ్నించారు. సీఎం మార్పుపై ప్రతిపక్ష పార్టీ బీజేపీ, జేడీఎస్‌ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. వారంతా పార్టీ అధిష్టానమా? ప్రశ్నించారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌ ( DK Shivakumar )మాట్లాడుతూ తనకు మరో ఆప్షన్‌ లేదని వ్యాఖ్యానించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని ఎవరినీ అడగలేదని.. నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటనలు చేసే నాయకులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

సిద్ధరామయ్య నాయకుడిగా ఉండడం పార్టీలో ‘ఎలాంటి అసంతృప్తి’ లేదు

అందరూ కష్టపడి పని చేశారని, తనలాంటి లక్షలాది మంది కార్యకర్తలు పని చేశారని.. మనం మొదట వారి గురించి ఆలోచించాలన్నారు. సిద్ధ రామయ్యకు మద్దతు ఇవ్వడం తప్ప తనకు ‘వేరే మార్గం’ లేదని తెలిపారు. ‘నా దగ్గర ఏ ఆప్షన్‌ ఉంది? నేను ఆయనకు మద్దతు ఇవ్వాలి. దానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పార్టీ హైకమాండ్‌ ఏం చెప్పినా.. ఏం నిర్ణయించినా అదే జరుగుతుంది. నేను ఇప్పుడు ఏం చర్చించాలనుకోవడం లేదు. లక్షలాది మంది కార్యకర్తలు ఈ పార్టీకి మద్దతు ఇస్తున్నారు’ అంటూ డీకే శివకుమార్‌ ( DK Shivakumar )వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ సిద్ధరామయ్య నాయకుడిగా ఉండడం పార్టీలో ‘ఎలాంటి అసంతృప్తి’ లేదని డిప్యూటీ సీఎం ( DK Shivakumar ) పేర్కొన్నారు. అయితే, ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రిని మార్చబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు బలాన్ని చేకూర్చాయి.“హై‑కమాండ్‌కు కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అధికార ఉంది” అన్న సూచన ఇచ్చారు — ఇది కర్ణాటకంలో కొత్త నేతల పోటిది అని కూడా భావిస్తున్నారు

Read Also:RCB: తొక్కిసలాటకు ఆర్సీబీయే కారణం: క్యాట్‌

#DKShivakumar #KarnatakaCongress #karnatakapolitics #NoDiscontent #PartyUnity #siddaramaiah Breaking News in Telugu Congress high command Karnataka CM change rumors DK Shivakumar denies rift in Karnataka Congress DK Shivakumar no dissatisfaction in party over Siddaramaiah DK Shivakumar what option do I have quote Google news Google News in Telugu Karnataka Congress leadership speculations Karnataka Deputy CM supports Siddaramaiah Latest News in Telugu Paper Telugu News Power tussle DK Shivakumar Siddaramaiah Karnataka Siddaramaiah unity with DK Shivakumar Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.