DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సీఎం పదవిని దక్కించుకోవడానికి ఎటువంటి విప్లవాలు లేదా పోరాటాలు అవసరం లేదని, అన్నీ కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ బలోపేతం కోసం తాను చేస్తున్న కృషి అధిష్ఠానానికి, ప్రజలకు తెలుసని, ఏ సమయంలో తనకు ఏ స్థానం ఇవ్వాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు. కర్ణాటక (Karnataka) సీఎం మార్పుపై కేంద్ర నాయకత్వం చర్చలు జరిపినట్లు వస్తున్న వార్తలపై తనకు సమాచారం లేదని శివకుమార్ పేర్కొన్నారు. తాను ప్రజల కోసం పోరాడానని, పదవి కోసం ఎప్పుడూ పోరాడలేదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Finland President: భారత్‌కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు.. మోదీతో కీలక భేటీ
సిద్ధరామయ్య వర్సెస్ డీకే: కొనసాగుతున్న ఉత్కంఠ
కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్‌ను కూర్చోబెడతారని ఆయన అనుచరులు ఆశిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరోక్షంగా గుర్తు చేస్తూనే, ప్రస్తుతానికి సంయమనం పాటిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. మరి అధిష్ఠానం ‘కాలం’ ఎప్పుడు వస్తుందని నిర్ణయిస్తుందో చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: