కాంగ్రెస్ పార్టీలో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి విషయంలో తీవ్రమైన పోటీ నెలకొందని, ఆ పదవిని దక్కించుకోవాలంటే పార్టీకి రూ.500 కోట్లు చెల్లించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో ఐదారుగురు సీనియర్ నాయకులు సీఎం కుర్చీపై కన్నేశారని, వారంతా కలిసి సిద్ధూను రాజకీయంగా ఎదగనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రూ.500 కోట్లు చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్లనే సిద్ధూకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పంజాబ్ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Read Also: Elon Musk: భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, ప్లాన్ ధరలు వెల్లడించిన మస్క్
బీజేపీ వ్యంగ్యాస్త్రాలు
నవజ్యోత్ కౌర్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలను భారతీయ జనతా పార్టీ నాయకులు అస్త్రంగా మలుచుకున్నారు. పంజాబ్ వంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవికే రూ.500 కోట్లు రేటు ఉంటే, ఆర్థికంగా బలమైన కర్ణాటక వంటి రాష్ట్రంలో సీఎం పదవికి ఇంకెంత చెల్లించాల్సి ఉంటుందో చెప్పాలని బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసింది.
డీకే శివకుమార్ ఘాటు స్పందన: పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
ఈ వివాదంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Shivakumar) అత్యంత ఘాటుగా స్పందించారు. సీఎం పోస్టుకు కోట్లు చెల్లించాలన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆధారరహితమైన ఆరోపణలు చేసే వారి మతిస్థిమితం సరిగా లేదని, వారిని వెంటనే ఏదైనా మంచి పిచ్చాసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నవజ్యోత్ కౌర్ ఆరోపణలను కొట్టిపారేస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి మంచి వైద్యం అవసరమని డీకే శివకుమార్ చురకలు అంటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: