हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest News: DK Shivakumar: రాజీనామా వదంతులను ఖండించిన డీకే శివకుమార్

Anusha
Latest News: DK Shivakumar: రాజీనామా వదంతులను ఖండించిన డీకే శివకుమార్

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించిన చర్చల గురించి జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి..ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) కీలక ప్రకటన చేశారు. ముఖ్యంగా తాను పార్టీ మారబోతున్నట్లు, కాంగ్రెస్‌కు రాజీనామా చేయబోతున్నట్లు వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు.

Read Also: TET: టెట్ మినహాయింపుతో NEP రద్దు కోసం ఢిల్లీలో మహాధర్నా

తాను కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిని అని, తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Chief Minister Siddaramaiah) శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఈ వదంతులు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన శివకుమార్ (DK Shivakumar).. తాను రాజీనామాతో పార్టీని బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కాదని ఘాటుగా బదులిచ్చారు.“నేను కాంగ్రెస్‌ను బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కాదు. ఈ పార్టీని నేను పగలు రాత్రి కష్టపడి నిర్మించాను. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాను. 2028లో మా పార్టీ (కర్ణాటకలో) తిరిగి అధికారంలోకి వస్తుంది” అని డీకేఎస్ ప్రకటించారు.

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు హాజరు కావాలని

మరోవైపు మంత్రివర్గంలో మార్పుల గురించి వచ్చిన ప్రశ్నలకు శివకుమార్ సమాధానమిస్తూ.. ఆ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇష్టం అని స్పష్టం చేశారు. అదంతా పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో తన పాత్ర కేవలం పార్టీ ఆదేశాలను శిరసావహించడమేనని పునరుద్ఘాటించారు.

Shivakumar denies resignation rumours
Shivakumar denies resignation rumours

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చర్చల నేపథ్యంలోనే తాను ఢిల్లీ వచ్చానన్న వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. తాను కేవలం కర్ణాటకలో 100 కొత్త కాంగ్రెస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు హాజరు కావాలని ఆహ్వానించడానికి వచ్చానని తెలిపారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని

“శంకుస్థాపన కార్యక్రమంతో పాటు అనేక ఇతర ఈవెంట్‌లు ఉన్నాయి. వాటన్నిటినీ ఎవరు నిర్వహిస్తారు? నేనే చేయాలి. అందుకే నేను (రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి) రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతాను? ఆ పరిస్థితి ఇంకా రాలేదు” అని శివకుమార్ పేర్కొన్నారు.పార్టీ బాధ్యతలతో పాటు మహాత్మా గాంధీ నేతృత్వంలో ఒక శతాబ్దం క్రితం జరిగిన చారిత్రక బెళగావి కాంగ్రెస్ సెషన్ గురించి తాను రచించిన “గాంధీ-భారత్” అనే పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నట్లు డీకేఎస్ తెలిపారు.

ఈ కార్యక్రమాలన్నీ పార్టీపై తనకు ఉన్న అంకితభావాన్ని చాటుతాయని.. 2028లో తిరిగి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాగా కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర కూడా ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని, కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే ఉంటుందని ధృవీకరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870