కర్ణాటక అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ఆర్‌ఎస్‌ఎస్ (RSS) గీతాన్ని ఆలపించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీలో వివాదం చెలరేగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్ గీతం పాడటంపై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. డీకే (DK Shivakumar) పార్టీ మారుతున్నారంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ వివాదంపై డీకే (DK Shivakumar) తాజాగా స్పందించారు. గాంధీ కుటుంబం తనకు దైవంతో సమానం అని చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్ఎస్ఎస్ గీతం పఠనంపై ఎవరినైనా బాధపెడితే క్షమాపణలు చెబుతానని.. కానీ దీన్ని రాజకీయంగా చూడటం సరికాదన్నారు. గాంధీ కుటుంబం పట్ల తన జీవితాంతం విధేయత, నిబద్ధత ఉంటుందని పేర్కొన్నారు. ‘ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోకను విమర్శించడానికి నేను ఆర్ఎస్ఎస్ గీతాన్ని పఠించాను. అంతేకాని వారిని ప్రశంసించడానికి కాదు. ఎమ్మెల్యే కావడానికి ముందు 47 ఏళ్ల వయసులో నేను రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాను. కాంగ్రెస్, గాంధీ కుటుంబం, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, జనతాదళ్ (లౌకిక), కమ్యూనిస్టులు, ఇతర రాజకీయ పార్టీల చరిత్రను అధ్యయనం చేశాను. రాజకీయ ప్రయోజనాల కోసం నా మాటలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని డీకే మండిపడ్డారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీ లో ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని(RSS anthem) ఆలపించడం ఆసక్తికరంగా మారింది. డీకే చర్యతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యంతో హర్షధ్వానాలు చేశారు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్.. శివకుమార్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా డీకే ఆర్‌ఎస్‌ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే’ ఆలపించారు. డీకే ఆర్‌ఎస్‌ఎస్ గీతాన్ని ఆలపించడంతో అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గట్టిగా బల్లలు చరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీఎం కుర్చీ ఇవ్వకుంటే తాను బీజేపీలో చేరుతానని కర్ణాటక కాంగ్రెస్‌కు డీకే హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ పాటను ఆలపించడంతో అసెంబ్లీలో గందరగోళం, వాగ్వాదం నెలకొంది.
డి.కె. శివకుమార్ కులం ఏమిటి?
ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు తమ్ముడు డి.కె. సురేష్ కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు, ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు.
కర్ణాటక మొదటి డిసి ఎవరు?
1992లో ఎం. వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో కర్ణాటక తొలి ఉప ముఖ్యమంత్రిగా ఎస్.ఎం. కృష్ణ పనిచేశారు. అప్పటి నుండి ఆ పదవి అప్పుడప్పుడు మాత్రమే కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటకలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన రెండు పర్యాయాలు ఆ పదవిలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: