మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకున్న ఓ విడాకుల ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట, వివాహం జరిగిన 24 గంటల్లోనే విడాకుల(Divorce Case) కోసం దరఖాస్తు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి అనంతరం భర్త తాను మర్చంట్ నేవీలో డాక్టర్‌గా పని చేస్తున్నానని, విధుల కారణంగా ఆరు నెలల పాటు సముద్రంలో నౌకపైనే గడపాల్సి వస్తుందని భార్యకు వివరించాడు.
Read Also: Karnataka: బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం
ఈ కీలక విషయాన్ని పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదని భార్య ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. జీవిత భాగస్వామి ఉద్యోగ స్వభావం, దూర ప్రయాణాలు వంటి అంశాలు దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేస్తాయని, అలాంటి విషయాలను దాచడం విశ్వాసానికి భంగం కలిగిస్తుందని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ వివాదం తీవ్రతరమై చివరకు పరస్పర అంగీకారంతో విడాకుల దిశగా వెళ్లారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పెళ్లికి(Divorce Case) ముందు ఉద్యోగం, పని సమయం, నివాస పరిస్థితులు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఉండాలని చాలామంది సూచిస్తున్నారు. ముఖ్యమైన విషయాలను దాచడం వల్ల సంబంధాలు ఎక్కువకాలం నిలవవని, ముందే మాట్లాడుకోవడం ఎంతో అవసరమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన ఆధునిక సంబంధాల్లో పారదర్శకత ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: