Employment Guarantee Scheme: మహాత్మాగాంధీ పేరు తొలగించడమే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి దేశవ్యాప్తంగా ఉన్న 13 కోట్ల మంది పేదల పొట్ట కొట్టాలనే కుట్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేస్తోందని రోహతక్ ఎంపి దీపేందర్ హుడా(Dipender Hooda) ఆరోపించారు. గాంధీభవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ప్రచార కమిటీ చైర్మన్, మెట్టు సాయి కుమార్ చైర్మన్, ఫిషర్మెన్ కమిటీ, సామరాంమోహన్ రెడ్డి మీడియా కమిటీ చైర్మన్, అల్లం భాస్కర్, సంధ్యా రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి, లింగం యాదవ్ తదితరులతో దీపెందర్ హుడా విలేఖరులతో కలిసి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పేరు కోసం రాజకీయం చేస్తుందని అన్నారు.
Read also: Bihar: బురఖా వివాదం: నితీష్ కుమార్ చర్యపై దేశవ్యాప్తంగా చర్చ
కోవిడ్ సమయంలో ఉపాధి హామీ సంజీవిని
కోవిడ్ సమయంలో పనికి ఆహార పథకం సంజీవిని లాగ పని చేసిందని వ్యాఖానించారు. జీ రామ్ జీ కి గ్యారెంటీ లేదని ఆయన ఆవేదన చెందారు. యూపిఎ ప్రభుత్వం రోజ్ గార్ యోజనను పూర్తిగా కేంద్రం నిధులు కేటాయించింది. బిజెపి ప్రభుత్వం జి రామ్ జి పేరుతో రాష్ట్రలపై భారం మోపాలని చూస్తుందని ఆరోపించారు. గతంలో రాష్ట్రాలు పని దినాలు చూపించింది కానీ ఇప్పుడు కేంద్రమే పని దినాలు నిర్ధారిస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఇప్పుడు పనుల ఎంపిక హక్కులు ఉండవు కేంద్రం ఆధీనంలో ఉంటదనీ తెలిపారు.
కేంద్రంపై కాంగ్రెస్ ఆరోపణ
90-10శాతం నిధులు కేంద్రం ఇచ్చేదని ఇప్పుడు 60-40 మించి నిధులు ఇవ్వదని తెలిపారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వదు కానీ అధికారం కేంద్రం చేతుల్లోనే ఉంటుంది క్రమేణామన్రేగా పథకాన్ని తీసివేయలని చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఒప్పుకొము అని తెలిపారు. వందే మాతరం గీతాన్ని మార్చి కొత్త గీతాన్ని తీసుకరావాలని బిజెపి చూస్తుందని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. కానీ కోర్టు వాస్తవాలను గుర్తించిందని అన్నారు. 2015 లో డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి ప్రయివేట్ ఫిర్యాదుతో ఇడి. సిబిఐ కేసు నమోదు చేసింది. మని లాండరింగ్ జరిగిందని పదే పదే రెండు సంస్థలు కేసులో పెట్టి ఇబ్బంది పెట్టిందని ఆవేదన చెందారు. కేవలం రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని అన్నారు. రాహుల్ గాంధీ పోరాటం చేశా రనీ చివరకు ఇడిసిబిఐ కేసును తిరస్కరించింది చివరకు సత్యమే గెలిచిందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: