📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest Telugu News : DIG Bhullar: డీఐజీని ప‌ట్టించిన వాట్సాప్ కాల్ రికార్డింగ్‌

Author Icon By Sudha
Updated: October 17, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంజాబ్‌లో డీఐజీ హ‌ర్‌చ‌ర‌ణ్ సింగ్ బుల్లార్‌(DIG Bhullar)ను సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. బుల్లార్‌కు చెందిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఆధారాల‌ను రిలీజ్ చేశారు. లంచం తీసుకోవాల‌ని మ‌ధ్య‌వ‌ర్తితో బుల్లార్ మాట్లాడిన వాట్సాప్ కాల్ రికార్డింగ్‌ను సాక్ష్యంగా చూపారు. మండి గోబింద్‌ఘ‌ర్‌కు చెందిన స్క్రాప్ డీల‌ర్ న‌రేశ్ బ‌ట్ట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. 2023 నాటి క్రిమిన‌ల్ కేసును సెటిల్ చేసేందుకు 8 ల‌క్ష‌ల అమౌంట్‌ను డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌ధ్య‌వ‌ర్తి కిర్ష‌ను కూడా అరెస్టు చేశారు. షిర్‌హింద్ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు అయిన ఫిర్యాదు కేసులో డీఐజీ బ‌ల్లార్ (DIG Bhullar) పేమెంట్ డిమాండ్ చేశారు. బుల్లార్‌పై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌లో అనేక అంశాలు పొందుప‌రిచారు. డీఐజీ బుల్లార్ ప‌దేప‌దే లంచం డిమాండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌తి నెలా పేమెంట్స్ ఇవ్వాల‌ని వేధించారు. సేవా పానీ పేరుతో ఆ వ‌సూళ్ల‌కు పాల్ప‌డేవారు అని తెలుస్తోంది. ఒక‌వేళ నెల‌నెలా వ‌సూళ్లు ఇవ్వ‌కుంటే, బిజినెస్ సంబంధిత నేరాల్లో ఇరికిస్తామ‌ని హెచ్చ‌రించేవాడు. నెల‌వారి వ‌సూళ్ల‌తో పాటు బుల్లార్ అద‌నంగా 28 ల‌క్ష‌లు డిమాండ్ చేసిన‌ట్లు స్క్రాప్ డీల‌ర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Read Also: http://Bihar Elections: ముస్లిం ఓట్లపై ఆశలు లేవంటూ నలుగురికే సీట్లు కేటాయింపు

DIG Bhullar

మ‌ధ్య‌వ‌ర్తి కిర్ష‌నుతో బుల్లార్ మాట్లాడిన ఫోన్ కాల్ అత‌ని అరెస్టులో కీల‌కంగా మారింది. డీఐజీ, మ‌ధ్య‌వ‌ర్తి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఆధారంగా సీబీఐ చ‌ర్య‌ల‌కు దిగింది. అక్టోబ‌ర్ 11వ తేదీన ఇద్ద‌రి మ‌ధ్య వాట్సాప్ ద్వారా సంభాష‌ణ జ‌రిగింది. అయితే లంచం వ‌సూల్ చేయాల‌ని చెప్పి మ‌ధ్య‌వ‌ర్తి కిర్ష‌నుకు ఆ ఫోన్ కాల్ ద్వారా డీఐజీ ఆదేశించిన‌ట్లు తేలింది. 8 ఫ‌ద్నే నే 8.. చాల్ జిన్నా దేనా నాల్ నాల్ ఫ‌ది చాల్‌, ఓన్ను ఖేద్ 8 క‌ర్ దే పురా అని డీఐజీ ఆ కాల్‌లో చెప్పారు. 8 ల‌క్ష‌లు తీసుకో.. లేదా అత‌ను ఎంత ఇస్తే అంత తీసుకో, కానీ చివ‌ర‌కు 8 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే అని చెప్పు అని డీఐజీ త‌న సంభాష‌ణ‌లో పేర్కొన్నారు. ఆ కాల్ ద్వారా డీఐజీ 8 ల‌క్ష‌ల లంచం డిమాండ్ చేసిన‌ట్లు రుజువైంది. బుల్లార్ ఇంటి నుంచి 5 కోట్ల న‌గ‌దు, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాలుగు గంట‌ల పాటు క్యాష్ కౌంటింగ్ మెషీన్‌తో నోట్ల క‌ట్ట‌ల‌ను లెక్కించారు. బుల్లార్ ద‌గ్గ‌ర నుంచి బీఎండ‌బ్ల్యూ, ఆడి కార్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 22 ల‌గ్జ‌రీ వాచీలు, 40 లీట‌ర్ల విదేశీ మ‌ద్యం, ప‌లు ర‌కాల ఆయుధాలు, డ‌బుల్ బారెల్ గ‌న్‌, పిస్తోల్‌, రివాల్వ‌ర్‌, ఎయిర్‌గ‌న్ ఉన్నాయి.

BSF అంటే ఏమిటి?

సరిహద్దు భద్రతా దళం ( BSF ) అనేది హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద భారతదేశంలోని ఒక కేంద్ర సాయుధ పోలీసు దళం . పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌తో భారతదేశ సరిహద్దులను కాపాడే బాధ్యత ఇది. ఇది 1965 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో భారతదేశ సరిహద్దుల భద్రత మరియు సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేయబడింది.

IPS అంటే ఏమిటి?

IPS పూర్తి రూపం ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇది భారతదేశంలోని మూడు ఆల్ ఇండియా సర్వీసెస్‌లో ఒకటి మరియు శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి, చట్టాన్ని అమలు చేయడానికి మరియు పౌరుల భద్రతను నిర్ధారించడానికి అంకితం చేయబడింది. 

Read hindi news,: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News Crime DIG Bhullar latest news Law Enforcement police investigation Telugu News WhatsApp Call Recording

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.