📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Surat : సూరత్‌లో కోట్ల విలువైన వజ్రాల చోరీ

Author Icon By Divya Vani M
Updated: August 19, 2025 • 8:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ రాష్ట్రంలో వజ్రాల నగరంగా పేరుగాంచిన సూరత్ (Surat) ఇప్పుడు భారీ చోరీతో వార్తల్లో నిలిచింది. ప్రముఖ డైమండ్ (Diamond) కంపెనీలో కోట్ల విలువైన వజ్రాలు చోరీకి గురయ్యాయి.ఈ దొంగతనం డీకే అండ్ సన్స్ కంపెనీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యాలయం కపోద్రా ప్రాంతంలోని పాలిషింగ్ యూనిట్‌గా పనిచేస్తోంది.అగస్టు 15 నుంచి 17 వరకు జరిగిన ఈ ఘటనలో దుండగులు సుమారు రూ.25 కోట్ల విలువైన వజ్రాలను అపహరించినట్టు సమాచారం.పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆ సమయంలో కంపెనీకి సెలవులు ఉన్నాయి. మూడు రోజులపాటు కార్యాలయం మూసివేయబడిన నేపథ్యంలో దుండగులు చోరీకు సిద్ధమయ్యారు.ముందుగా భవనంలోని కింది అంతస్తు తలుపు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం నేరుగా మూడో అంతస్తుకు చేరుకున్నారు.

Surat : సూరత్‌లో కోట్ల విలువైన వజ్రాల చోరీ

గ్యాస్ కట్టర్‌తో సేఫ్ ధ్వంసం

మూడో అంతస్తులో ఉన్న మెటల్ సేఫ్‌ను గ్యాస్ కట్టర్‌తో తెరిచి అందులోని వజ్రాలను అపహరించారు. దీనికి ముందు ప్లాన్‌ చేసుకున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.చోరీ జరిగిన సమయంలో సీసీటీవీ కెమెరాలు ధ్వంసమైనవిగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఇది దర్యాప్తును మరింత క్లిష్టం చేస్తోంది.కెమెరాలు ఎందుకు పనిచేయలేదో తెలుసుకోవడం ఇప్పుడు కీలకం. ఇది నిందితుల ప్రణాళికలో భాగమేనా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆగస్టు 18న కార్యాలయానికి వచ్చిన కంపెనీ యజమాని ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.వజ్రాలు కనబడకపోవడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే సిబ్బందితో మాట్లాడి పోలీసులను సంప్రదించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

పోలీసులు ముద్దు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.ఈ భారీ చోరీ నేపథ్యంలో సూరత్ నగర భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వజ్రాల కేంద్రంగా పేరున్న ఈ నగరంలో ఇలాంటి సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.పోలీసులు ప్రస్తుతం స్పెషల్ టాస్క్ ఫోర్సును రంగంలోకి దించారు. దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు, ట్రాఫిక్ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు.

Read Also :

https://vaartha.com/minister-nara-lokesh-meets-cp-radhakrishnan/andhra-pradesh/532299/

25 crore diamonds CCTV camera issue DK and Sons Diamond Company Gujarat diamond theft police investigation Surat diamond theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.