దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ధర్మస్థల (Dharamsthala) కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. కర్ణాటక (Karnataka) ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ ఉదంతంపై విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ధర్మస్థల (Dharamsthala) చుట్టూ వందలాది మృతదేహాలను, ముఖ్యంగా మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను తానూ సామూహికంగా ఖననం చేసానని మాజీ పారిశుద్ధ కార్మికుడు ముసుగు మనిషి భీమా ఇప్పుడు మాట మార్చాడు. బలవంతంగా తనతో ఈ ప్రకటన చేయించారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ఒక పుర్రెను తనకు ఒక బృందం ఇచ్చి, తానై ఈ ప్రకటన చేయాలని ఒత్తిడి చేసిందని సిట్ అధికారుల ఎదుట చెప్పాడు. దీంతో కేసులో కొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. 13 స్పాట్లలో ఒక్క చోట మాత్రమే అస్థిపంజరాలు దొరికాయి. దీంతో తవ్వకాలు నిలిపివేశారు సిట్ అధికారులు. భీమాను ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించారు.
భీమా ఆరోపణలతో సంచలనంగా మారిన కేసు
కాగా మహిళలు, మైనర్ బాలికల మృతదేహాలను సామూహికంగా ఖననం (Mass burial of dead bodies) చేయాలని ఆలయ పెద్దలు తనను బెదిరించారని భీమా ఇటీవల ఆరోపించాడు. మరణించిన వారిలో చాలామంది లైంగిక దాడులకు గురై హత్య చేయబడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఫిర్యాదుదారుడు చూపిన 15 ప్రదేశాలలో సిట్ తవ్వకాలు జరుపుతున్నది. ఈ కేసు ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ భీమా మాట మార్చడంపై పలు అనుమానాలకు తావునిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఈ కేసును ప్రభుత్వం సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం, ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. లభ్యమైన అస్తిపంజరాలు, ఎముకల్ ఫోరెన్సిక్ నివేదికలు, ఫిర్యాదుదారుడి తాజా వాంగ్మూలనం ఆధారంగా కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: