📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 షెడ్యూల్ విడుదల మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య

DGCA: విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వినియోగంపై నిషేధం

Author Icon By Pooja
Updated: January 4, 2026 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విమాన ప్రయాణాల్లో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విమానాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పవర్ బ్యాంక్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.

Read Also: UP: గ్రేటర్ నోయిడాలో AI వైద్య సేవలకు శ్రీకారం

DGCA

పవర్ బ్యాంక్ ఛార్జింగ్‌కు పూర్తిస్థాయి నో

కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణికులు విమానాల్లో పవర్ బ్యాంక్‌ల ద్వారా మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయరాదు. అలాగే విమానాల్లో ఉన్న ఎలక్ట్రిక్ ప్లగ్‌లకు పవర్ బ్యాంక్‌లను కనెక్ట్ చేయడంపైనా నిషేధం విధించింది. పవర్ బ్యాంక్‌లను కేవలం హ్యాండ్ బ్యాగ్‌లో మాత్రమే ఉంచుకోవాలని, ఓవర్ హెడ్ బిన్‌లలో పెట్టకూడదని డీజీసీఏ స్పష్టం చేసింది.

లిథియం బ్యాటరీల వల్ల పెరుగుతున్న ప్రమాదాలు

పవర్ బ్యాంక్‌లలో ఉపయోగించే లిథియం బ్యాటరీల కారణంగా ఇటీవల పలు విమానాల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. లిథియం బ్యాటరీలు అధిక శక్తివంతమైనవిగా ఉండటంతో షార్ట్ సర్క్యూట్, వేడి పెరగడం వంటి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా నాణ్యత లేని లేదా పాత బ్యాటరీలు మరింత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి

ఈ కొత్త నిబంధనలపై ప్రయాణికులకు ముందుగానే అవగాహన కల్పించాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది. టికెట్ బుకింగ్ సమయంలో, చెక్-ఇన్ కౌంటర్ల వద్ద, అలాగే విమానాల్లో ప్రకటనల రూపంలో ఈ సమాచారం అందించాలని సూచించింది. లిథియం బ్యాటరీలకు సంబంధించిన భద్రతా సమస్యలు లేదా ఘటనలను తప్పనిసరిగా డీజీసీఏకు నివేదించాలని పేర్కొంది.

అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో ఇప్పటికే అమలు

ఇప్పటికే ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ వంటి పలు అంతర్జాతీయ విమాన సంస్థలు పవర్ బ్యాంక్ వినియోగంపై పరిమితులు విధించాయి. ఇప్పుడు భారత్ కూడా అదే దిశగా అడుగులు వేసింది. చెకింగ్ సమయంలో లిథియం బ్యాటరీలతో కూడిన పరికరాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి డీజీసీఏ సూచించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AviationNews Google News in Telugu Latest News in Telugu PowerBankBan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.