📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Modi-ప్రజల అభివృద్దే తమ ధ్యేయం

Author Icon By Pooja
Updated: September 14, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ ఈశాన్య ప్రజల భావాలను తరచూ దెబ్బతీస్తుందని ఆరోపించారు. అసోం రాష్ట్రం దర్రాంగ్ జిల్లాలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రముఖ గాయకుడు, భారతరత్న భూపేన్ హజారికాను కాంగ్రెస్ ఘోరంగా అవమానించిందని విమర్శించారు. “భారతరత్నను గాయకుడికి ఇస్తారా?” అని మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని మోదీ తెలిపారు. తాను వ్యక్తిగత విమర్శలను భరించగలనని, కానీ ఈశాన్య ప్రజలు ఆరాధించే మహనీయుడిని(Great man) అవమానించడం మాత్రం సహించలేనని స్పష్టం చేశారు.

అసోంలో ప్రధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రజాసభకు ముందుగా మోదీ, మంగళ్‌దోయ్‌లో పలు కీలక ప్రాజెక్టులకు పునాది వేశారు. వీటిలో కొత్త మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, జీఎన్ఎం స్కూల్, బీఎస్సీ నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు ఉన్నాయి. అదేవిధంగా గువాహటిలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే రింగ్ రోడ్ ప్రాజెక్టు, బ్రహ్మపుత్ర నదిపై కురువ–నారెంగి వంతెన నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఆరోగ్య, మౌలిక వసతులు, రవాణా రంగాలకు పెద్ద ప్రయోజనం కలిగిస్తాయని మోదీ పేర్కొన్నారు.

పారిశ్రామిక వృద్ధి, ఉపాధిపై దృష్టి

భూపేన్ హజారికా శతజయంతి వేడుకల్లో కూడా పాల్గొననున్నట్లు మోదీ గుర్తుచేశారు. గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగఢ్‌లో బయో-ఎథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అదనంగా, నుమాలిగఢ్ రిఫైనరీలో పాలీప్రొఫైలిన్ ప్లాంట్‌కు పునాది వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి(industrial development) తోడ్పడటమే కాకుండా, స్థానికులకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ అభివృద్ధి చర్యలు అసోాన్ని జాతీయ పురోగతిలో కీలక పాత్ర పోషించేలా చేస్తాయని మోదీ స్పష్టం చేశారు.

మోదీ కాంగ్రెస్‌పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?
భారతరత్న భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించిందని, అది ఈశాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన విమర్శించారు.

అసోంలో మోదీ ఏ ప్రాజెక్టులకు పునాది వేశారు?
మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, జీఎన్ఎం స్కూల్, నర్సింగ్ కాలేజీ, గువాహటి రింగ్ రోడ్, బ్రహ్మపుత్ర వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు.

Read hindi News: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/nirmala-sitharaman-gst-will-reduce-prices-and-benefit-the-people/business/547154/

Assam Development Bhupen Hazarika BJP congress Google News in Telugu Latest News in Telugu modi Narendra Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.