📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BJP: రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్

Author Icon By Vanipushpa
Updated: February 13, 2026 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత రాజకీయాల్లో మరోసారి ‘బహిష్కరణ’ రాజకీయం వేడెక్కుతోంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే.(Nishikant Dubey). ఆయన్ను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించాలని దూబే కోరారు. ఈ క్రమంలోనే అసలు రాజ్యాంగ బద్ధంగా ఒక ఎంపీని సభ నుంచి ఎలా బహిష్కరిస్తారు? దానికి ఉన్న ప్రక్రియ ఏమిటి? అనే అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Huzurabad Municipal Election Results: కౌశిక్ రెడ్డికి భారీ షాక్.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ హవా

BJP: రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్

ప్రివిలేజ్ కమిటీకి లేదా ఎథిక్స్ కమిటీకి విచారణ

లోక్‌సభ సభ్యుడిని తొలగించడం అనేది ఒక సుదీర్ఘమైన, చట్టబద్ధమైన ప్రక్రియ. ఇది ప్రధానంగా ఐదు దశల్లో సాగుతుంది. ముందుగా సభలోని ఏ సభ్యుడైనా మరో సభ్యుడిపై ఫిర్యాదు చేస్తూ స్పీకర్‌కు అధికారికంగా నోటీసు ఇవ్వవచ్చు. అయితే ఈ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్.. దానిని ప్రివిలేజ్ కమిటీకి లేదా ఎథిక్స్ కమిటీకి విచారణ నిమిత్తం పంపిస్తారు. ఈ కమిటీ ఆరోపణలపై లోతైన విచారణ జరుపుతుంది. అవసరమైతే సాక్షులను పిలుస్తుంది. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీకి తన వాదనను వినిపించుకునే అవకాశం కూడా ఇస్తుంది. విచారణ అనంతరం కమిటీ తన నివేదికను, సిఫార్సులను సిద్ధం చేస్తుంది. ఆ తర్వాత కమిటీ ఇచ్చిన నివేదికను లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఒకవేళ ఆ ఎంపీ తప్పు చేసినట్లు కమిటీ నిర్ధారించి, బహిష్కరణను సిఫార్సు చేస్తే.. దానిపై సభలో తీర్మానం ప్రవేశ పెడతారు. సభకు హాజరైన సభ్యుల్లో మెజారిటీ సభ్యులు ఆ తీర్మానానికి మద్దతుగా ఓటు వేస్తే.. సదరు ఎంపీ సభ్యత్వం వెంటనే రద్దు అవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BJP Political Moves Indian Politics Lok Sabha Controversy Opposition Leader India Parliamentary Expulsion Demand rahul gandhi Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.