📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: DelhiBlast: భారత్‌పై కొత్త ఫిదాయీన్ దాడికి జైషే మహ్మద్ కుట్ర

Author Icon By Pooja
Updated: November 19, 2025 • 4:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్(Jaish-e-Mohammed) మళ్లీ భారత్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో మరో ఫిదాయీన్‌ (ఆత్మాహుతి) దాడికి ప్రణాళికలు రచిస్తూ, ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఉగ్రవాద సంస్థ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగించి భారీగా నిధులు సేకరిస్తున్నట్లు కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు(DelhiBlast) దర్యాప్తు సమయంలో, జైషే చీఫ్‌లు పాకిస్థానీ యాప్ ‘సదాపే’ సహా ఇతర ఆన్‌లైన్ మార్గాల్లో విరాళాల కోసం పిలుపునిస్తున్నట్లు ఆధారాలు బయటపడ్డాయి. ఈసారి మహిళా విభాగాన్ని ఉపయోగించి దాడులు జరపాలనే కుట్ర ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు.

Read Also: Delhi Blast: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ

DelhiBlast

మహిళా విభాగం ‘జమాత్ ఉల్-ముమినత్’ పాత్ర

జైషే మహ్మద్‌కు ఇప్పటికే మహిళలతో కూడిన ప్రత్యేక విభాగం ఉంది. దీనికి మసూద్ అజార్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తోంది. ఎర్రకోట పేలుళ్ల కేసులో(DelhiBlast) ప్రధాన నిందితురాలిగా ఉన్న ‘మేడమ్ సర్జన్’ డాక్టర్ షహినా సయీద్ ఈ విభాగానికే చెందినదని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులకు బూట్లు, ఉన్ని సాక్స్, టెంట్ వంటి సామగ్రితో కూడిన ‘వింటర్ కిట్’ ఇవ్వాలంటే 20,000 పాకిస్థానీ రూపాయలు (భారత కరెన్సీలో సుమారు రూ.6,400) విరాళంగా ఇవ్వాలని జైషే కోరుతోంది. ఈ విరాళాలు ఇచ్చిన వారిని కూడా ‘జిహాదీ’లుగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.

ఎర్రకోట దాడిలో 15 మంది మృతి

నవంబర్ 10న చోటుచేసుకున్న ఎర్రకోట పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ తీసుకున్న వీడియో కూడా ఇటీవల బయటకు వచ్చింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

JaishEMohammed Latest News in Telugu MasoodAzhar Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.