Delhi: కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు

Read Time:  1 min
Delhi: కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు
FONT SIZE
GET APP

Delhi: ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా ‘పి-పాప్ కల్చర్ ఇండియా టూర్ 2026’లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన కన్సర్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే అది ఆయన పాటల గురించి కాదు అక్కడ విక్రయించిన నీళ్ల బాటిళ్ల ధర గురించి. ఎందుకంటే 20 రూపాయల విలువ చేసే ఒక్క వాటర్ బాటిల్‌ను ఏకంగా రూ.100కు అమ్ముకుని సంగీత ప్రియులను దోచుకున్నారు.

Read Also: Gas Cylinder Price Hike: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. గ్యాస్ ధరలు పెరిగే ఛాన్స్!

Delhi: కన్సర్ట్‌లో నీళ్ల బాటిల్ రూ.100.. షాక్‌లో సంగీత ప్రియులు
Delhi: Water bottle costs Rs.100 at concert.. Music lovers in shock

ఫిబ్రవరి 28న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో (Delhi Jawaharlal Nehru Stadium) జరిగిన ఈ కన్సర్ట్ బయట ఓ విక్రేత ఒక్క వాటర్ బాటిల్‌ను రూ.100 కు విక్రయించాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఓ సోషల్ మీడియా యూజర్ దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆ వీడియోలో ఒక విక్రేతను నీళ్ల బాటిల్ ధర అడగగా.., అతను ఏమాత్రం తడుముకోకుండా “100 రూపాయలు” అని సమాధానం ఇచ్చాడు. “మరీ ఇంత దారుణమా?” అంటూ ఆ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు.

మరికొన్ని చోట్ల జనం మధ్య తీవ్రమైన తోపులాటలు, గొడవలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. “కన్సర్ట్ టికెట్లు ఇప్పటికే ఖరీదైనవి. ఇక మంచినీటికి కూడా వంద రూపాయలు వసూలు చేస్తే సామాన్యులు ఎలా వెళ్తారు?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.