దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని(Delhi) అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నవంబరు 1వ తేదీ నుంచి ఢిల్లీలో రిజిస్టరైన, ‘బిఎస్-6’ ఉద్గార ప్రమాణాలకు లోబడి లేని కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో ప్రతి సంవత్సరం శీతాకాలం సమీపించేకొద్దీ గాలి నాణ్యత గణనీయంగా పడిపోతుంది. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు, ముఖ్యంగా పాత డీజిల్ ట్రక్కుల కాలుష్యం దీనికి ప్రధాన కారణాలలో ఒకటిగా తేలింది. ఈ నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్, దాని పరిసర ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ (సిఎఅఎం) కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుత తర్వాత ఢిల్లీలో మరింత కాలుష్యం(Pollution)పెరిగింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరుగుతుంది.
Read also: భారీ వర్షాలకు ఇండ్లలోకి చేరుతున్న పాములు
కొన్ని వాహనాలకు మినహాయింపు
నవంబరు 1 నుండి అమలులోకి వచ్చే ఈ నిషేధం కేవలం ఢిల్లీలో(Delhi) రిజిస్టర్ అయిన, బిఎస్-6 ప్రమాణాలు పాటించని వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, కొన్ని రకాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న డీజిల్ వాహనాలు, సిఎన్జి, ఎల్ ఎల్ జీ గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ నడిచే ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, బిఎస్-6 వాహనాలకు తాత్కాలిక ఉపశమనం తాత్కాలిక చర్యగా, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన బిఎస్-6 ప్రమాణాలకు లోబడి ఉన్న వాణిజ్య సరుకు రవాణా వాహనాలను అక్టోబరు 31, 2025 వరకు ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ గడువు తర్వాత అవి కూడా పూర్తిగా నిషేధానికి లోబడి ఉంటాయి. పాత వాహనాలను మార్చుకోవడానికి లేదా బిఎస్-6 ప్రమాణాలకు అప్ గ్రేడ చేసుకోవడానికి వీలుగా ఈ సమయాన్ని ఇచ్చారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: