Putin visit Delhi traffic : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో, డిసెంబర్ 5 (శుక్రవారం) నాడు ఢిల్లీలో విస్తృతంగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ ట్రాఫిక్ హెచ్చరిక ప్రకారం, ఐటీఓ చౌక్, బీఎస్‌జెడ్ మార్గ్, ఢిల్లీ గేట్, జేఎల్‌ఎన్ మార్గ్, రాజ్‌ఘాట్ క్రాసింగ్ వంటి ముఖ్య ప్రాంతాల చుట్టూ ఆంక్షలు విధిస్తారు. మదర్ తెరేసా క్రెసెంట్, టీన్ మూర్తి మార్గ్, అక్బర్ రోడ్, జనపథ్ రోడ్‌లపై ట్రాఫిక్ నియంత్రణ కఠినంగా ఉంటుంది.
ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు
ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు మదర్ తెరేసా క్రెసెంట్, టీన్ మూర్తి మార్గ్, అక్బర్ రోడ్, ఎంఎల్‌ఎన్‌పీ, జనపథ్ రోడ్‌లపై వాహనాలు నిలిపివేయడం, పార్కింగ్ పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను టో చేసి కాళి బారి మందిర్ మార్గ్ లేదా భైరన్ మందిర్ ఎదుటి ట్రాఫిక్ పిట్‌కు తరలిస్తారు.
ఈ సమయంలో వందేమాతరం మార్గ్ నుంచి సైమన్ (Putin visit Delhi traffic) బోలివర్ మార్గ్, కౌటిల్య మార్గ్, సన్ మార్టిన్ మార్గ్, సునహెరి మస్జిద్ పరిసరాలు మరియు రైల్ భవన్ చుట్టూ దారి మళ్లింపులు అమల్లో ఉంటాయి. సర్దార్ పటేల్ మార్గ్, జనపథ్, టీన్ మూర్తి మార్గ్‌లను తప్పించుకోవాలని పోలీసులు సూచించారు. ప్రత్యామ్నాయంగా డీడీయూ మార్గ్, ఆసఫ్ అలీ రోడ్, మౌలానా ఆజాద్ రోడ్, కామరాజ్ మార్గ్, రైసినా రోడ్ ఉపయోగించాలని సూచించారు.
Read also: Top Secure Banks: RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
ఈ సమయంలో జనపథ్ రోడ్, విండ్సర్ ప్లేస్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఫిరోజ్ శా రోడ్, మండీ హౌస్ రౌండబౌట్, సికంద్రా రోడ్, డబ్ల్యూ–పాయింట్ వద్ద పార్కింగ్, ఆగడం నిషేధం. ఇక్కడి నుంచి టో చేసిన వాహనాలనూ ట్రాఫిక్ పిట్‌కు తరలిస్తారు.
జనపథ్–టోల్స్టాయ్ మార్గ్, టోల్స్టాయ్–కేజీ మార్గ్, రంజిత్ సింగ్ ఫ్లయ్యోవర్, బరాఖంబా రోడ్‌లపై దారి మళ్లింపులు అమలు చేస్తారు. ఈ రోడ్లను ప్రయాణికులు తప్పించుకోవాలని సూచించారు.
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనపథ్ రోడ్, విండ్సర్ ప్లేస్, ఫిరోజ్ శా రోడ్, మండీ హౌస్, సికంద్రా రోడ్, భైరన్ మార్గ్‌లపై వాహనాలు నిలిపివేయడం పూర్తిగా నిషేధం. నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం ఢిల్లీకి చేరుకోగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన అధికారిక స్వాగత వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం 11.30 గంటల ప్రాంతంలో రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: