📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

News telugu: Delhi Schools: ఢిల్లీలో 100కి పైగా స్కూళ్లకు బాంబు హెచ్చరికలు

Author Icon By Sharanya
Updated: September 20, 2025 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని న్యూఢిల్లీ శనివారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని 100కి పైగా పాఠశాలలకు ఏకకాలంలో బాంబు హెచ్చరికలు (Bomb warnings) రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ బెదిరింపులు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి.

‘టెర్రరైజర్స్111’ అనే గ్రూపు నుంచి మెయిల్‌లు

ఉదయం 6:10 గంటల సమయంలో ‘టెర్రరైజర్స్111′ అనే పేరుతో ఉన్న గ్రూపు పలు పాఠశాలలకు బెదిరింపు మెయిల్‌లు పంపించింది. “మీ స్కూల్ భవనంలో బాంబులు అమర్చాం, వెంటనే స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి” అనే ధోరణిలో మెయిల్ సబ్జెక్ట్ ఉండటంతో అధికారులు హుటాహుటిన స్పందించారు.

News telugu

అప్రమత్తమైన అధికారులు – స్కూళ్లు ఖాళీ

ఈ సమాచారం అందిన వెంటనే దిల్లీ పోలీసులు(Delhi Police), బాంబు నిర్వీర్య దళాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. డ్వారక, నజఫ్‌గఢ్, కృష్ణా నగర్ వంటి ప్రాంతాల్లోని పాఠశాలల వద్ద బృందాలు చేరుకుని స్కూళ్లను ఖాళీ చేయించాయి. విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా తరలించారు.

పూర్తిస్థాయి తనిఖీలు – ఎలాంటి బాంబులు లేవు

పోలీసులు, బాంబు స్క్వాడ్‌లు పాఠశాల ప్రాంగణాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇది ఉత్తి బెదిరింపు అని తేలింది.

తల్లిదండ్రుల్లో ఆందోళన – స్కూల్‌ల వద్ద గందరగోళం

ఈ ఘటనతో తల్లిదండ్రులు స్కూల్‌ల వద్దకు గుంపులుగా చేరారు. తమ పిల్లల గురించి ఆందోళనతో ఉన్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసారు. కొన్ని స్కూల్‌ల వద్ద కొంతకాలం గందరగోళ వాతావరణం నెలకొంది.

దర్యాప్తులోకి సైబర్ టిమ్

ఈ బెదిరింపులు ఇప్పటి వరకు ఉత్తి ఇమెయిల్స్‌గానే తేలినా, ఈమెయిల్స్ ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి పంపించారు? అనే విషయాలపై సైబర్ విభాగం ముమ్మరంగా దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే పాఠశాలల సీసీ టీవీలు, మెయిల్ లాగ్స్ పరిశీలనలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/kerala-high-court-if-there-is-no-means-of-support-why-polygamy/national/551065/

Bomb Threat Email Breaking News Delhi news delhi police Delhi Schools Bomb Threat Fake Bomb Threats latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.