📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi Reels Gun Death: రీల్స్ పిచ్చి.. గన్ తో షూట్ చేసుకున్న యువకుడు

Author Icon By Tejaswini Y
Updated: March 17, 2026 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Delhi Reels Gun Death: Reels is crazy.. a young man who shot himself with a gun

Delhi Reels Gun Death: ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్‌లో సోమవారం (మార్చి 16) ఒక భయంకరమైన ప్రమాదం జరిగింది. స్నేహితుడు వీడియో రికార్డ్ చేస్తుండగా, పవన్ అనే యువకుడు తుపాకీతో తన ఛాతిలో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో లేదా సరదాగా చేసిన ఈ ప్రయత్నం చివరకు విషాదాంతమైంది.

Read Also: Digital attacks : మితిమీరుతున్న ‘డిజిటల్ దాడులు.

ఘటన వివరాలు:

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ అశోక్ నగర్‌లోని దల్లుపురా గ్రామానికి చెందిన పవన్ (28) ఈ ఘటనలో మరణించాడు. తన కజిన్ అయిన హిమాన్షుకు చెందిన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను పవన్ తన చేతిలోకి తీసుకుని ఎగాదిగా పరీక్షించాడు. ఈ క్రమంలో ఓ స్టంట్ వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు. హిమాన్షు ఈ ఘటనను తన మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా, పవన్ తుపాకీలోకి మ్యాగజైన్ లోడ్ చేశాడు. “ఆ బటన్ నొక్కు, లోపలికి వెళ్తుంది” అని హిమాన్షు సూచించడం వీడియోలో వినిపించింది.

లైసెన్స్‌డ్ వెపన్‌తో ప్రమాదం

ఆ తర్వాత పవన్ తుపాకీని కాక్ చేయగా, హిమాన్షు “ఫైర్ చేయొద్దు” అని హెచ్చరించాడు. కానీ, ఆ మాటలను పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు. క్షణాల వ్యవధిలోనే తుపాకీని తన ఛాతి ఎడమ వైపు పెట్టుకుని, కెమెరా వైపు చూసి చిన్నగా నవ్వాడు. మరుక్షణమే ట్రిగ్గర్ నొక్కడంతో తూటా దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో పవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన హిమాన్షు.. “సోదరా, ఏం పని చేశావ్?” అని భయంతో అరవడం వీడియోలో రికార్డయింది.

పోలీసుల దర్యాప్తు

వెంటనే పవన్‌ను వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ధర్మశిల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని పరిశీలించాయి. హిమాన్షుకు చెందిన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో పాటు 10 లైవ్ క్యాట్రిడ్జ్‌లను, ఘటనను రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఆధారాలు, ప్రాథమిక విచారణ ఆధారంగా న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 105, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Delhi crime news Delhi Reels Gun Death Gun Misuse New Ashok Nagar Tragic death Viral Video

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.