📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi peeragarhi Crime: ఢిల్లీ మిస్టరీ..పార్క్‌ చేసిన కారులో 3 మృతదేహాలు

Author Icon By Siva Prasad
Updated: February 9, 2026 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi peeragarhi Crime: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌ వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే కారులో ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read Also: BJP Government: దిల్లీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Delhi Peeragarhi Crime: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ఫ్లైఓవర్‌పై అనుమానాస్పద స్థితిలో ఉన్న కారును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కారులోని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మృతులు ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Delhi Peeragarhi Crime: Delhi Mystery..3 bodies found in a parked car

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు

ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇది హత్యా? లేక కారులో ఏవైనా విషవాయువులు లీక్ అయి జరిగిన ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పీరాగఢి ఫ్లైఓవర్‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కారు అక్కడికి ఎప్పుడు వచ్చింది, అందులో ఎవరున్నారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Crime News Today. Delhi crime news Delhi Latest News Delhi peeragarhi Crime Peeragarhi Flyover Incident Three Dead Bodies in Car

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.