డిసెంబర్ 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ శీతాకాల(Delhi) సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభలో సమావేశాల ప్రారంభముతోనే, ఇటీవల మృతి చెందిన సభ్యుల కోసం ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19 వరకు, మొత్తం 15 రోజుల పాటు కొనసాగనున్నాయి. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్(C. P. Radhakrishnan) తొలిసారిగా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తున్నారు.
Read also: శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం
సభలో ప్రాధాన్యత పొందిన బిల్లులు, చర్చలు
సభలో కేంద్ర ప్రభుత్వం(Delhi) సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, అణు ఇంధనం, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారుల సవరణ వంటి కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. వీటిద్వారా పలు సంస్కరణలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతిపక్షాలు కొత్త నాలుగు లేబర్ కోడ్‌లు, జాతీయ భద్రత, పెరుగుతున్న కాలుష్యం, రైతుల కనీస మద్దతు ధర, ఢిల్లీలోని పేలుళ్ల ఘటన వంటి సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకట్టే వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ఓటర్ల జాబితా సవరణ చర్చ కోసం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: