📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Delhi: బెయిల్ మీద బయటకొచ్చి.. అత్యాచార బాధితురాలిపై కాల్పులు జరిపిన నిందితుడు

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన న్యాయవ్యవస్థ పనితీరుపై, మహిళల భద్రతా పరిస్థితులపై మరల తీవ్ర చర్చకు దారితీస్తోంది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు పెట్టి న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి మరోసారి మానసిక, శారీరక హింసకు గురయ్యింది. అత్యాచార నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి ఆమెను కాల్చి చంపేందుకు ప్రయత్నించిన ఘటన ఢిల్లీ వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది.వివరాల్లోకి వెళ్తే, అబూజైర్ సాఫీ (Abu Zair Safi) అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు గతంలో కేసు పెట్టింది. ఈ కేసులో జైలుకు వెళ్లిన నిందితుడు ఇటీవలే బెయిల్‌పై విడుదల అయ్యాడు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి అతను బాధితురాలిని వేధించడం, ఆమెను వెంటపడటం వంటివి చేస్తున్నాడు. ఈ వేధింపులు శ్రుతి మించడంతో బాధితురాలు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకుంది.

హుటాహుటిన రంగంలోకి

అయితే ఈ లోపే నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు.ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండడం చూసి వెంటనే ఆమె వద్దకు వెళ్లాడు. అక్కడే ముందుగా మాట్లాడేందుకు ప్రయత్నించిన అతడు.. ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాధితురాలికి ఛాతీ భాగం (Chest part) లో బుల్లెట్ తగిలింది. తీవ్ర గాయం కాగా, నిందితుడు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంనటే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పోలీసులకు కూడా సమాచారం అందించగా, హుటాహుటిన రంగంలోకి దిగారు. అసలేమైందని ఆరా తీయగా, అబుజైర్ సాఫీయే తనపై కాల్పులు జరిపాడని బాధితురాలు పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.కొన్ని గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.

Delhi:

కాల్పులు జరిపి

ప్రస్తుతం అతడు జైల్లో ఉండగా, బాధితురాలు మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. కానీ అత్యాచారం చేసి జైలు పాలైన ఓ నిందితుడు, బెయిల్ మీద బయటకు వచ్చి మరీ చంపాలనుకోవడం, నడిరోడ్డు మీదే కాల్పులు జరిపి అందుకు ప్రయత్నించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి సరైన భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందనే విమర్శిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసినప్పటికీ.. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై, ప్రభుత్వాలపై ఉందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

మొదటి తుపాకీని ఎవరు కనిపెట్టారు?

మొదటి తుపాకీని చైనాలో కనిపెట్టారు. గన్‌పౌడర్‌ ఆవిష్కరణ తర్వాత చైనాలోనే తొలి తుపాకీ తయారు చేయబడింది.

AK-47 ఏ రకం తుపాకీగా పరిగణించబడుతుంది?

AK-47 ఒక అసాల్ట్ రైఫిల్ (Assault Rifle) గా పరిగణించబడుతుంది. ఇది సెలెక్టివ్-ఫైర్ రైఫిల్, అంటే దీనిని సెమీ-ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్‌లో కాల్చవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/rcb-will-chinnaswamy-stadium-be-closed-concerns-among-rcb-fans/national/525085/

Breaking News Delhi crime news Delhi shooting case Indian law and order latest news rape accused attack rape survivor attacked Telugu News Vasant Vihar incident women safety india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.