కొత్త సంవత్సర వేడుకలు సమీపిస్తున్న సందర్భంలో, దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ రాత్రిపూట ఆపరేషన్ చేపట్టారు. (Delhi) సౌత్-ఈస్ట్ జిల్లా పోలీసులు ఆపరేషన్ ఆఘాత్ 3.0 పేరుతో శుక్రవారం రాత్రి మెరుపు దాడులు చేపట్టి, శాంతిభద్రతలను పర్యవేక్షించడంతో పాటు నేరాలను అరికట్టారు. ఈ ఆపరేషన్‌లో వందల మంది అరెస్ట్ చేయడంతో పాటు, పలువురిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఎక్సైజ్ చట్టం, ఎన్డీపీఎస్ చట్టం, గ్యాంబ్లింగ్ చట్టం కింద 285 మంది నిందితులను అరెస్ట్ (Arrest) చేశాం అని డీసీపీ హేమంత్ తివారీ తెలిపారు . అలాగే, ముందుజాగ్రత్త చర్యగా 504 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేర చరిత్ర ఉన్న 116 మందిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
Read Also: BIS New Standards: అగర్‌బత్తుల తయారీలో హానికర రసాయనాలకు చెక్
ప్రజా భద్రతపై పోలీసుల ప్రాధాన్యత
ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలను కూడా డీసీపీ తివారీ వివరించారు. 10 ప్రాపర్టీ అఫెండర్లు, ఐదు ఆటో-లిఫ్టర్లు అరెస్ట్ అయ్యారు. (Delhi) వీరి నుండి 21 నాటు తుపాకులు, 20 బుల్లెట్లు, 27 కత్తులు స్వాధీనం చేసారు. మొత్తం 12,258 క్వార్టర్లు అక్రమ మద్యం, 6.01 కిలోల గంజాయి సీజ్ చేశారు. జూదగాళ్ల నుంచి రూ.2,30,990 నగదు, 310 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసారు. అదనంగా, 231 ద్విచక్ర వాహనాలు, ఒక ఫోర్-వీలర్ కూడా స్వాధీనం అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు, నేర కార్యకలాపాలను ముందుగానే నిరోధించేందుకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలోని నేర ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక నిఘా వర్గాల సమాచారంతో రాత్రంతా ఏకకాలంలో దాడులు, వాహన తనిఖీలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని, ప్రజా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: