Delhi-NCR and GRAP-4 : శనివారం (డిసెంబర్ 13, 2025) సాయంత్రం ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో, గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు కాలుష్య నిర్వహణ కమిషన్ (CAQM) అత్యవసరంగా GRAP-4 ను అమలు చేసింది.
సాయంత్రం 6 గంటల నాటికి ఢిల్లీలో AQI 441 గా నమోదైంది. ఇది ఈ సంవత్సరంలోనే అత్యంత దారుణమైన గాలి నాణ్యతగా అధికారిక డేటా పేర్కొంది. గాలి స్థబ్దత, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మీటరాలజికల్ మార్పులు కలసి కాలుష్యం పెరగడానికి కారణమయ్యాయి.
NCR మొత్తం వెంటనే అమలులోకి GRAP-4 ఆంక్షలు
CAQM అన్ని NCR రాష్ట్రాలకు (Delhi-NCR and GRAP-4 ) ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్—తక్షణమే GRAP-4 అమలు చేయాలని ఆదేశించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత నియమాలు పూర్తిగా అమలులోకి వస్తాయి.
CAQM ప్రకటనలో ఇలా పేర్కొంది:
“ప్రస్తుత గాలి నాణ్యతను దృష్టిలో పెట్టుకుని, మరింత దిగజారకుండా ఉండేందుకు NCR మొత్తంలో వెంటనే Severe+ (AQI > 450) స్థాయి చర్యలు అమలు చేయాలని నిర్ణయించాం.”
GRAP-4లో అమలయ్యే కీలక నిషేధాలు
GRAP-4 అనేది, ఇప్పటికే అమలులో ఉన్న Stage 1, 2, 3 ఆంక్షలకు అదనంగా అమలవుతుంది.
స్టేజ్-4 లో ప్రధానంగా ఇవి వర్తిస్తాయి:
- ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులపై సంపూర్ణ నిషేధం
- కాలుష్యాన్ని పెంచే నాన్-ఎసెన్షియల్ ట్రక్కుల ప్రవేశంపై బ్యాన్
- పాఠశాలలు హైబ్రిడ్ మోడ్ (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్) కు మార్చడం — 10వ, 12వ తరగతులు మినహా
- ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న BS-IV మరియు అంతకన్నా పాత డీజిల్ భారీ వాహనాలకు నిషేధం
- ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50% స్టాఫ్‌తో వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే మరిన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు—
- కాలేజీలు, విద్యాసంస్థలను మూసివేయడం
- నాన్-ఎమర్జెన్సీ వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయడం
- ఒడ్డ్-ఈవెన్ వాహనాల రేషన్ పద్ధతి అమలు
AQI రేపు కూడా ‘Severe’ గా ఉంటుందని హెచ్చరిక
గాలి నాణ్యత హెచ్చరిక వ్యవస్థ ప్రకారం, ఆదివారం (డిసెంబర్ 14) కూడా AQI ‘Severe’ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.
వింటర్ సీజన్‌లో ఢిల్లీ-NCRలో GRAP ప్రకారం నాలుగు దశలుగా గాలి నాణ్యత వర్గీకరణ ఉంటుంది:
- Stage 1: Poor (AQI 201–300)
- Stage 2: Very Poor (AQI 301–400)
- Stage 3: Severe (AQI 401–450)
- Stage 4: Severe Plus (AQI 450 పైగా)
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :