Delhi: ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ మైనర్ బాలుడు కారు నడుపుతూ 23 ఏళ్ల యువకుడిని ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడి తండ్రి తాజాగా స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. ఒక కుటుంబంగా తాము తీవ్రంగా సిగ్గుపడుతున్నామని, బాధిత కుటుంబం అనుభవిస్తున్న వేదనను మాటల్లో చెప్పలేమని ఆయన అన్నారు. మృతుడి తల్లిని జీవితాంతం క్షమాపణ కోరుతూనే ఉంటానని భావోద్వేగంతో వెల్లడించారు.
ఇటీవలే ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తన తండ్రికి చెందిన స్కార్పియో కారును వేగంగా నడుపుతూ, ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల సాహిల్ ధనేశ్రా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి ఆగి ఉన్న ట్యాక్సీని ఢీకొట్టడంతో దాని డ్రైవర్ కూడా గాయపడ్డాడు.
Read Also: PMKisan 22nd Installment: అకౌంట్లలోకి డబ్బులు.. ఎప్పుడంటే?
మృతుడి తల్లి తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడి మృతికి ప్రమాదం కారణం కాదని, నిందితుడు తన సోదరితో కలిసి సోషల్ మీడియా(Social media) కోసం ‘ఫన్ రీల్స్’ చిత్రీకరిస్తూ, రాంగ్ లేన్‌లో అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆమె ఆరోపించారు. దీనిపై నిందితుడి తండ్రి మాట్లాడుతూ తాను పని మీద గోరఖ్‌పూర్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, తెలియని వయసులో తన కొడుకు కారు తాళాలు తీసుకుని ఉంటాడని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కొడుకు పారిపోలేదని, సహాయం చేశాడని కూడా ఆయన పేర్కొన్నారు.
నిందితుడైన మైనర్‌ను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా, అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. అయితే, 10వ తరగతి బోర్డు పరీక్షలు రాసేందుకు అతడికి మధ్యంతర ఉపశమనం లభించింది. మరోవైపు, వాహన యజమానిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తండ్రిపై కూడా మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: