Delhi MCD by-election result : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆధిపత్యం చాటుకుంది. మొత్తం 12 వార్డుల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 7 సీట్లను గెలుచుకొని ముందంజలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 3 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీలు తలా ఒక సీటు సాధించాయి.
నవంబర్ 30న పోలింగ్ జరిగిన ఈ 12 వార్డుల్లో ముందు వరుసగా 9 సీట్లు బీజేపీ వద్ద ఉండగా, మిగిలిన మూడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందాయి. తాజా ఉప ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతం 38.51 శాతంగా నమోదైంది. 2022లో జరిగిన పూర్తి MCD ఎన్నికల్లో (250 వార్డులు) ఓటింగ్ శాతం 50.47 శాతంగా ఉండటం గమనార్హం.
Read Also: Temba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆసక్తికర వ్యాఖ్యలు
ఓట్ల లెక్కింపుకు ఢిల్లీలోని కంజవాలా, పితంపురా, భారత్ (Delhi MCD by-election result) నగర్, సివిల్ లైన్స్, రౌస్ అవెన్యూ, ద్వారకా, నజఫ్‌గఢ్, గోల్ మార్కెట్, పుష్ప విహార్ మరియు మండవాలి ప్రాంతాల్లో మొత్తం 10 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.
ఈ ఫలితాలు ఢిల్లీ స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశం కల్పిస్తున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: