📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi Liquor Case: కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై అన్నా హజారే స్పందన

Author Icon By Aanusha
Updated: February 28, 2026 • 12:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేజ్రీవాల్ నిర్దోషిగా బయటకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.రాజకీయ ఆశయాల వల్ల 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమం దెబ్బతిన్నదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన హజారే, ఇప్పుడు కోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

Read Also: ISRO student training : ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

Delhi Liquor Case: Anna Hazare’s response to Kejriwal’s clean chit

కేజ్రీవాల్‌కు కీలక సూచన

కేజ్రీవాల్‌ను ఇకనైనా తన గురించి లేదా తన పార్టీ గురించి మాత్రమే ఆలోచించడం మానేసి, సమాజం కోసం, దేశం కోసం కష్టపడాలని హితవు పలికారు.కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా తన కార్యకర్తలేనని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అన్నాహజారే జన్‌లోక్‌ పాల్ ఉద్యమంతోనే కేజ్రీవాల్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అన్నాహజారే నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమం దేశంలోనే అతిపెద్ద ప్రజాపోరాటం. ఈ ఉద్యమంలో ఆయన వెంట కేజ్రీ నడిచారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన తర్వాత పలు సందర్భాల్లో తన శిష్యుడ్ని టార్గెట్ చేస్తూ హజారే విమర్శలు గుప్పించారు. గతేడాది ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమిపై స్పందింస్తూ.. అధికార దాహంతోనే ఓడిపోయారని హజారే వ్యాఖ్యానించారు. అనేక అవినీతి ఆరోపణలు.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడటం వల్లే ప్రజలు ఓడించారని అన్నారు. ఇక, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఆరోపణలను నిరూపించే ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anna Hazare Arvind Kejriwal Clean Chit Delhi Liquor policy case Ralegan Siddhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.