📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

Delhi: స్నేహితురాలితో ప్రియాంకాగాంధీ తనయుడి నిశ్చితార్థం?

Author Icon By Saritha
Updated: December 30, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రియాంకాగాంధీ అనగానే (Delhi) ఆమెకు పరిచయవాక్యాలు అవసరం లేదు. అచ్చం నానమ్మ ఇందిరాగాంధీ పోలికలను పుణికిపుచ్చుకున్న ఆమె భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల గారాలపట్టి అయిన ప్రియాంకాగాంధీ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆమె వయనాడ్ ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, ముందుకు దూసుకెళ్తున్నారు.

అయితే ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) కుమారుడు రైహాన్ వాద్రా(25) తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు (Delhi) వినిపిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన అవివా బేగ్ తో ఏడేళ్ల నుంచి రైహాన్ వాద్రా మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవివా బేగ్ కు రైహాన్ పెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అవివా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Read Also: Visa: స్వదేశానికి రాలేం బాబోయ్.. అంటున్న భారతీయులు

కమర్షియల్ ఫొటోగ్రపీతో రైహాన్ గుర్తింపు

రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు, వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులో కెమెరా చేపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు. (Delhi) దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతో ప్రోత్సహించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్ లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తొలి ఎగ్జిబిషన్ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aviva Baig Delhi Social News Gandhi Family News Latest News in Telugu Priyanka Gandhi Raihan Vadra Raihan Vadra Engagement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.