📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi High Court: మహిళ ఏడ్చినంత మాత్రాన అది..వరకట్న వేధింపుల కిందికి రాదు

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 4:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ న్యాయవ్యవస్థలో ప్రతి తీర్పు ప్రజలకు కొత్త దిశనిచ్చే అవకాశం కలిగిస్తుంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ తీర్పులో కోర్టు (Delhi High Court) స్పష్టంగా తెలిపింది – ఒక మహిళ ఏడుస్తున్నందుననే అది వరకట్న వేధింపులకు రుజువు కాదు.కేసు వివరాలను పరిశీలిస్తే, 2010 డిసెంబర్‌లో ఒక మహిళ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వారి జీవితంలో సాధారణ కష్టాలు, కుటుంబ సంబంధ సమస్యలు ఎదురయ్యాయి. 2014 మార్చి 31వ తేదీన ఆ మహిళ మరణించారు. ఈ ఘటన తర్వాత మహిళ కుటుంబ సభ్యులు, సహచరులు భర్త, అతని కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.వివాహానికి ముందు ఖర్చు చేసిన రూ.4 లక్షల కారణంగా, అలాగే మోటార్ సైకిల్, నగదు, బంగారు బ్రాస్‌లెట్ వంటి వస్తువుల కోసం ఆమెను వేధించినట్లు ఆ ఆరోపణలలో పేర్కొన్నారు. అత్తింటి వారు కూడా ఆమెను వేధించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వీటన్నింటి ఆధారంగా వాస్తవానికి వరకట్న వేధింపులు జరిగాయని దావా చేశారు.

ఒక మహిళ ఏడిస్తే అది వరకట్న వేధింపులకు

అయితే ఈ ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించలేదు. మహిళ మరణానికి సహజ కారణాలే (న్యుమోనియా) అని పోస్ట్‌మార్టం నివేదికలో స్పష్టంగా వెల్లడైంది. ఈ నివేదికను ట్రయల్ కోర్టు కూడా పరిగణనలోకి తీసుకుంది.అందుకే కోర్టును కొట్టివేసింది. కానీ మృతురాలి తరఫు వాళ్లు హైకోర్టుకు వెళ్లారు. దీంతో న్యాయస్థానం తాజాగా విచారణ జరిపింది. ఈక్రమంలోనే ట్రయల్ కోర్టు (Trial Court) ఇచ్చన తీర్పును సమర్థించింది. ముఖ్యంగా తన తీర్పులో కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. కేవలం ఒక మహిళ ఏడిస్తే అది వరకట్న వేధింపులకు బలమైన సాక్ష్యం కాదని స్పష్టం చేసింది. ఏడుపు అనేది అనేక ఇతర కారణాల వల్ల కూడా ఉండవచ్చుని. ఉదాహరణకు నిస్పృహ, ఆందోళన, ఇతర మానసిక ఒత్తిడి వల్ల కూడా ఒక మహిళ ఏడవచ్చని కోర్టు పేర్కొంది.ఆమె కేవలం ఏడ్చిందని చెప్పడం, అదనపు కట్నం కోసం ఆమెను వేధించారని రుజువు చేయదు” అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Delhi High Court

మహిళలను రక్షించడానికి

అలాగే మహిళ తండ్రి చేసిన వాదనల్లో ఏమాత్రం పస లేదని పేర్కొంది. అలాగే తమ కూతురు భర్త ఇంటిలో ఎదుర్కొన్న హింసకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలను వారు సమర్పించలేక పోయారని గుర్తు చేసింది. ఈ తీర్పు న్యాయ నిపుణులు, సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. వరకట్న వేధింపుల నుంచి మహిళలను రక్షించడానికి చట్టాలు ఎంత అవసరమో.. వాటిని దుర్వినియోగం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా అంతే ముఖ్యమని ఈ తీర్పు తెలియజేసింది. నిజమైన బాధితులకు న్యాయం జరగాలంటే, చట్టాలు దుర్వినియోగం కాకుండా ఉండాలని ఈ తీర్పు గుర్తు చేసింది.

ఢిల్లీ హైకోర్ట్ ఏ సంవత్సరం ప్రారంభమైంది?

ఢిల్లీ హైకోర్ట్ 1966లో ప్రారంభమైంది.

ఢిల్లీ హైకోర్ట్ యొక్క అధికార పరిధి ఏంటి?

దేశ రాజధాని న్యూఢిల్లీ లోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులపై పూర్తి అధికారం కలిగి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/bangalore-metro-additional-charge-on-luggage-in-metro/breaking-news/531562/

Delhi High Court verdict domestic violence case India Indian judiciary news key court rulings India post-mortem report India spouse harassment case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.