రోహిణీ కార్తిలో ఎండలు మండుతూ ఉండాల్సిన సమయంలో వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రోహిణీ కార్తి (Rohine karthi)కంటే ముందే తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశాలు ఉన్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా. తెలుగు రాష్ట్రాలతో సహా దేశ రాజధాని ఢిల్లీలోనూ భారీ ఈదురు గాలుల(Heavy gusts of wind)తో కూడిన వర్షం పడింది. గాలికి అనేక ప్రాంతాల్లో హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి.వర్షం, గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ (traffic)నిలిచిపోయింది. విజయ్‌చౌక్ దగ్గర వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.
రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీలో వడగళ్లతో కుంభవృష్టి కురిసింది. ముందుగా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా వరుణుడు విరుచుకుపడ్డాడు. ఈదురు గాలులతో కూడిన వర్షం, ఆ వెంబడే వడగళ్లు పడటంతో ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సఫ్దర్‌గంజ్ ఏరియాలో గంటకు 79 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయగా, సెంట్రల్ ఢిల్లీ, గోల్ మార్కెట్, లోడి రోడ్‌లో కూడా వడగండ్లు పడ్డాయి.
మెట్రో ట్రాక్‌పై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా మెట్రో రైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది, ట్రైన్స్ ఆలస్యం నడిచాయి.
జలావాసాలు
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. అసోం రాష్ట్రంలోని గువహటిలో జోరు వానలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జనావాసాలు కాస్తా.. జలావాసాలుగా మారాయి.
Read Also :Andhra Pradesh: బంగారు బిస్కెట్ల పేరుతో ఘరానా మోసం..లబోదిబోమంటున్న భాదితులు