మహిళను ప్రెగ్నెన్సీని కొనసాగించాలని బలవంతం చేయడం ఆమె శరీరంపై దాడేనని ఢిల్లీ హైకోర్టు (Delhi HC) అభిప్రాయపడింది. దీనివల్ల ఆమె మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలిపింది. తన మాట వినకుండా భార్య 14 వారాల ప్రెగ్నెన్సీని తొలగించుకుందని భర్త పెట్టిన క్రిమినల్ కేసును కొట్టేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం గర్భస్రావానికి భర్త అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. ఒక మహిళ తన గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం ఆమె శారీరక సమగ్రతను ఉల్లంఘిస్తుందని,
Read Also: Fire Accident:ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
స్వయం ప్రతిపత్తిలో ఒక అంశం
మానసిక గాయాన్ని తీవ్రతరం చేస్తుందని ఢిల్లీ హైకోర్టు (Delhi HC) పేర్కొంది. ఆమె 14 వారాల పిండాన్ని వైద్యపరంగా తొలగించుకున్నందుకు.. ఆమె భర్త దాఖలు చేసిన క్రిమినల్ కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వ్యక్తిగత స్వయం ప్రతిపత్తిలో ఒక అంశం అని, పునరుత్పత్తిపై నియంత్రణ అనేది అన్ని మహిళల ప్రాథమిక అవసరం, హక్కు అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: