📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Delhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 2:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Delhi: Future daughter-in-law at Priyanka Gandhi’s rally.. video goes viral

కాంగ్రెస్(Congress) అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడు రైహాన్ వాద్రా(Raihan Vadra) ఇటీవల స్నేహితురాలు అవివా బేగ్ తో నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా రైహాన్ వాద్రా-అవివా బేగ్ కు నిశ్చితార్థం జరిగిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

అవివా బేగ్ వీడియో వైరల్

తాజాగా అవివా బేగ్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది వయనాడ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ పోటీ చేశారు. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ర్యాలీలో కాబోయే కోడలు అవివా బేగ్ ప్రత్యక్షమయ్యారు. రైహాన్ వాద్రాతో కలిసి ర్యాలీలో రైహాన్ వాద్రా పక్కన నిలబడిన అవివా బేగ్ చాలా ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా(25) తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఢిల్లీ కి చెందిన అవివా బేగ్(Aviva Baig) తో ఏడేళ్ల నుంచి రైహాన్ వాద్రా మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవివా బేగ్ కు రైహాన్ పెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నివేదికలు అందాయి. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అవివా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీ(Delhi)లో స్థిరపడింది. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వైల్ లైఫ్ ఫొటోగ్రపీతో రైహాన్ కు మంచి గుర్తింపు

రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు, వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులో కెమెరా చేపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు. దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతో ప్రోత్స హించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్ లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తొలి ఎగ్జిబిషన్ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aviva Baig Celebrity Wedding News congress party gandhi family Priyanka Gandhi Rehan Vadra Wayanad MP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.