ఢిల్లీలో మధ్యాహ్నం దొంగతనం కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో ( Delhi) పట్టపగలే జరిగిన ఓ విచిత్రమైన దొంగతనం కేసు కలకలం రేపుతోంది. ఈశాన్య ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ప్రాంతంలో రోడ్డుపై జరిగిన చిన్నపాటి ప్రమాదం ఒక పెద్ద దోపిడీకి మారింది. 22 ఏళ్ల రామరతన్ అగర్వాల్ తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ను స్వల్పంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు బైక్ సవార్లు అతనితో వాగ్వాదానికి దిగారు. స్థానికులు వచ్చి వారిని సమాధానపరచగా, అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
Read also: ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో అమెరికా అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!
11 కిలోల వెండి మాయం
ఇంటికి చేరుకున్న రామరతన్ స్కూటర్ డిక్కీ తెరిచి చూసేసరికి షాక్ అయ్యాడు. అందులో ఉన్న 11 కిలోల వెండి (silver) పూర్తిగా మాయమైందని గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు (Delhi) ప్రాథమిక దర్యాప్తులో ఈ దొంగతనం ముందస్తుగా పన్నిన ప్లాన్ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు కావాలనే రామరతన్ బండిని ఢీకొట్టి గొడవకు దిగి, ఆ గందరగోళంలో వెండి ఉన్న బ్యాగును దొంగిలించినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: