📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest News: Delhi Crime: టీచర్ల వేధింపులు తట్టుకోలేక..10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Author Icon By Anusha
Updated: November 20, 2025 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi Crime) లో, ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఒక 16 ఏళ్ల విద్యార్థి, ఉపాధ్యాయుల నిరంతర వేధింపులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..

Read Also: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి

ప్రతిరోజూ.. మంగళవారం ఉదయం 7.15 గంటలకు తండ్రి ఆ విద్యార్థిని పాఠశాల వద్ద వదిలివెళ్లారు. అయితే అదే రోజు మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో.. సెంట్రల్ ఢిల్లీలోని రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషన్ సమీపంలో సదరు బాలుడు గాయాలతో పడి ఉన్నట్లు తండ్రికి ఫోన్ వచ్చింది.

వారు ఆసుపత్రికి చేరుకునేలోపే బీఎల్‌ కపూర్‌ ఆసుపత్రిలోని వైద్యులు ఆ బాలుడు మరణించినట్లు ధృవీకరించారు. కుమారుడి మరణంతో కుమిలిపోయిన తండ్రి.. వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యాయులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెలుగులోకి సూసైడ్ లెటర్

గత కొద్ది రోజులుగా తన కొడుకును పాఠశాలలోని ఈ ఉపాధ్యాయులు మానసికంగా హింసించడం వల్లే ప్రాణాలను తీసుకున్నాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రి ఆరోపణల ప్రకారం.. మంగళవారం ఒక డ్రామా క్లాస్‌లో ఆ బాలుడు అనుకోకుండా కిందపడిపోయాడు. దీనికి ఒక టీచర్ స్పందిస్తూ.. ఆ బాలుడిని అవమానించి, అతిగా నటిస్తున్నావని ఎగతాళి చేశారు.

బాలుడు ఏడవడం మొదలు పెట్టినప్పటికీ.. ఆ టీచర్ “నువ్వు ఎంత ఏడ్చినా పట్టించుకోను” అని మరింత కోపంగా మాట్లాడారు. ఇదంతా తట్టుకోలేకపోయిన విద్యార్థి బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ కూడా వేధింపులను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తండ్రి ఆరోపించారు. మరోవైపు పోలీసులు బాలుడి బ్యాగులో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయుల పేర్లను స్పష్టంగా తెలియజేశాడు.

Delhi Crime: Unable to bear the harassment from teachers, 10th grade student commits suicide

వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెబుతూ.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. తద్వారా మరే విద్యార్థి కూడా తనలాంటి దుస్థితిని ఎదుర్కోకుండా చూడాలని కోరాడు. అలాగే తన అవయవాలు పని చేసే స్థితిలో ఉంటే వాటిని అవసరమైన వారికి దానం చేయండని విజ్ఞప్తి చేశాడు.

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

తన సోదరుడికి, తండ్రికి క్షమాపణలు చెప్పాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తండ్రిని, సోదరుడిని చక్కగా చూసుకోవాలని కోరాడు. ఈ సూసైడ్ లెటర్ ఆధారంగా.. పోలీసులు సదరు ఉపాధ్యాయులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయుల వేధింపుల ఆరోపణలపై పాఠశాల సిబ్బందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. చూడాలి మరి ఈకేసులో మున్ముందు ఏం జరగనుంది అనేది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

16 year old student death Delhi student suicide latest news Rajendra Place metro incident teacher harassment case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.