ఆరేళ్ల చిన్నారిపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీ (Delhi Crime) లోని భజన్‌పురలో ఈ నెల 18కి ముందు జరిగినట్లు తెలుస్తోంది. 13, 14, 15 ఏళ్ల వయసున్న నిందితులు బాలికను టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావంతో ఇంటికి వచ్చిన బాలికను గమనించి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు.
Read Also: Phone Tapping Case: KCRకు నోటీసులు.. మహేశ్‌గౌడ్ ఏమన్నారంటే?

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: