📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Delhi Crime: ఢిల్లీలో దారుణం ఒకే కుటుంబంలో నలుగురి హత్య

Author Icon By Saritha
Updated: February 25, 2026 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi Crime: ఢిల్లీలోని చందన్ పార్క్ ఏరియాలో మంగళవారం రాత్రి అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒకే ఇంట్లో నిద్రిస్తున్న మహిళతో పాటు, ముగ్గురు పసిపిల్లలు రక్తపు మడుగులో శవాలై కనిపించారు. నిందితుడు అత్యంత కిరాతకంగా పదునైన ఆయుధంతో వారి గొంతు కోసి చంపేశాడు. బుధవారం ఉదయం స్థానికులు గమనించే వరకు ఈ ఘోరం బయటపడలేదు.

చందన్ పార్క్ ఏరియాలో ముంచన్ కెవాత్ తన భార్య, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. ఆజాద్‌పూర్ మండిలో కూరగాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్థానికులు వారి ఇంటికి వెళ్లి చూసేసరికి.. ముంచన్ భార్య, ముగ్గురు చిన్నారులు రక్తపు మడుగులో విగతజీవులై పడి ఉండటం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

Read Also: America: నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

Delhi Crime: Brutal murder of four members of the same family in Delhi

కుటుంబ కలహాలే కారణమా?

బాధితులు నిద్రలో ఉండగానే ఈ దాడి జరిగిందని, వారు ప్రతిఘటించే అవకాశం కూడా లేకుండా నిందితుడు గొంతు కోసి చంపేసినట్లు గుర్తించారు. ఈ హత్యలు జరిగినప్పటి నుండి ఇంటి యజమాని పరారీలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో, కుటుంబ కలహాల కారణంగానే ముంచన్ తన భార్య, పిల్లలను హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు, నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చందన్ పార్క్ పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల దృశ్యాలను అధికారులు సేకరిస్తున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chandan Park Delhi Crime Latest News in Telugu Mother and Three Children Killed Murder case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.