📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Delhi CM : ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు

Author Icon By Sudha
Updated: July 2, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) రేఖా గుప్తా (Rekha Gupta)కు గత నెల అధికారిక నివాసాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఇంటికి అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. సీఎం (Delhi CM)గా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్‌ లైన్స్‌లోని రాజ్‌ నివాస్‌ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ కేటాయించింది. బంగ్లా 1, బంగ్లా 2ను సీఎం కోసం కేటాయించగా.. అందులో బంగ్లా 1లో రేఖా గుప్తా తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉండనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ఇంటికి అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఢిల్లీ సీఎం నివాసానికి రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు

రూ.60 లక్షలతో
పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన టెండర్‌ నోటీసు ప్రకారం.. సీఎం కోసం బంగ్లా 1, 2 కేటాయించగా.. బంగ్లా 1ని నివాసం కోసం ఉపయోగిస్తున్నారు. రెండో బంగ్లా క్యాంప్‌ ఆఫీస్‌గా ఉపయోగించనున్నారు. ఇక సీఎం నివాసం ఉండే బంగ్లాకు రూ.60 లక్షలతో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. అందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు, రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, రూ.2 లక్షలతో ఆ ఇంటికి నిరంతర విద్యుత్‌ సరఫరా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. రూ.1.8 లక్షల విలువైన రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యాన్లు, రూ.85వేల విలువైన OTG (ఓవెన్ టోస్ట్ గ్రిల్), రూ.77 వేల విలువైన ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్, రూ.60 వేల విలువైన డిష్‌వాషర్, రూ.63 వేల విలువైన గ్యాస్ స్టవ్, రూ.32 వేల విలువైన మైక్రోవేవ్‌, రూ.91 వేల విలువైన ఆరు గీజర్‌లను ఆ ఇంట్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.6 లక్షల వ్యయంతో ఇంట్లో మొత్తం 115 లైట్లు, వాల్‌ లైటర్లు, హ్యాంగింగ్‌ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు టెంటర్‌లో పేర్కొన్నారు.
శీష్‌ మహల్‌
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఢిల్లీ సీఎం (Delhi CM)గా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టారు. అయితే, అంతకముందు కేజ్రీవాల్ నివాసం ఉన్న సివిల్‌ లైన్స్‌లోని సీఎం అధికారిక నివాసం వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ బంగ్లాను బీజేపీ ‘శీష్‌ మహల్‌’ గా అభివర్ణిస్తోంది. వివాదాస్పద శీష్‌ మహల్‌కు దూరంగా ఉండాలని బీజేపీ అప్పుడే నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేఖా గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి షాలిమార్‌ బాగ్‌లో నివాసం ఉంటున్నారు. దీంతో అక్కడికి వచ్చే సందర్శకులు, వీఐపీలు, సీనియర్‌ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక సచివాలయానికి వెళ్లేందుకు రోజూ 25 కిలోమీటర్లు ఆమె ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన దాదాపు 100 రోజుల తర్వాత రేఖా గుప్తాకు సివిల్‌ లైన్స్‌లోని రాజ్‌ నివాస్‌ మార్గంలో అధికారిక బంగ్లాను పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ కేటాయించింది. ఆమె సొంత నియోజకవర్గానికి సమీపంలోనే నూతన బంగ్లాను కేటాయించింది. సీఎంకు 1/8, 2/8 నంబర్లతో కూడిన బంగ్లాలను కేటాయించారు.

Read Also:Dalai Lama: నా వారసుడు ఎవరంటే.. స్పష్టతనిచ్చిన దలైలామా

#60LakhRenovation #BungalowUpgrade #CMResidence #DelhiCM #DelhiPolitics #GovernmentSpending #PublicMoney #RekhaGupta #RenovationCost BJP CM Rekha Gupta official residence details Breaking News in Telugu Delhi CM Rekha Gupta house renovation cost Delhi CM residence ₹60 lakh controversy Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News PWD tender for Delhi CM residence Rekha Gupta CM house AC TV CCTV budget Rekha Gupta latest news renovation Rekha Gupta official bungalow renovation news Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Type-7 bungalow Delhi CM Rekha Gupta What is the cost of Delhi CM house renovation? Why is ₹60 lakh spent on Delhi CM house?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.